గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By PNR
Last Updated : సోమవారం, 29 జూన్ 2015 (17:02 IST)

"మాహిష్మతీ... ఊపిరి పీల్చుకో, బాహుబలి తిరిగొచ్చాడు".. బాహుబలి డైలాగ్స్ ట్రైలర్ రిలీజ్

"బాహుబలి" డైలగ్స్ ట్రైలర్‌ను సోమవారం విడుదల చేశారు. ఈ చిత్రంపై ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో అంచనాలు ఉన్న విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో ఆ చిత్రం దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి 31 నిమిషాల నిడివితో కూడిన డైలాగ్స్ ట్రైలర్‌ను విడుదలచేశారు. 
 
ఇందులో రానా, అనుష్కల మధ్య సంభాషణ, మరికొన్ని దృశ్యాలు మాత్రమే ఉన్నాయి. "చచ్చేలోగా ఒక్కసారైనా చూడాలని నువ్వు, ఇంకొకసారి కసితీరా ఈ చేతులతో చంపాలని నేను..." అని అనుష్కను ఉద్దేశించి రానా అంటే, "మాహిష్మతీ... ఊపిరి పీల్చుకో, బాహుబలి తిరిగొచ్చాడు" అని అనుష్క చెప్పే డైలాగులున్నాయి. 
 
దీంతో పాటు ప్రభాస్ గుర్రంపై రావడం, లోయలోకి పడిపోవడం, యుద్ధంలో శత్రువులను చీల్చి చెండాడటం వంటి దృశ్యాలున్నాయి. ఈ ట్రైలర్ ఈ చిత్రం విడుదలైన కేవలం ఆరు గంటల్లోనే లక్ష పాతిక వేల మందికి పైగా వీక్షించడం గమనార్హం.