గురువారం, 28 మార్చి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Raju
Last Modified: హైదరాబాద్ , సోమవారం, 10 ఏప్రియల్ 2017 (03:24 IST)

అలాంటి పిచ్చోళ్లు ఉంటేనే బాహుబలి సాధ్యం: ప్రభాస్‌ను ఆకాశానికెత్తిన రాజమౌళి

ప్రభాస్ వంటి నిబద్ధ నటుడు లేకపోతే బాహుబలి సినిమాయే లేదని ఆ చిత్ర దర్శకుడు ఎస్.ఎస్ రాజమౌళి చెప్పారు. బాహుబలి’లాంటి సినిమాలను మళ్లీ మళ్లీ తీయడం సాధ్యం కాదనీ, ప్రభాస్‌లాంటి పిచ్చోడు ఉంటేనే ఇలాంటి సినిమాలు తీయడం సాధ్యమవుతుందనీ రాజమౌళి బాహుబలి హీరో ప్రభాస

ప్రభాస్ వంటి నిబద్ధ నటుడు లేకపోతే బాహుబలి సినిమాయే లేదని ఆ చిత్ర దర్శకుడు ఎస్.ఎస్ రాజమౌళి చెప్పారు. బాహుబలి’లాంటి సినిమాలను మళ్లీ మళ్లీ తీయడం సాధ్యం కాదనీ, ప్రభాస్‌లాంటి పిచ్చోడు ఉంటేనే ఇలాంటి సినిమాలు తీయడం సాధ్యమవుతుందనీ రాజమౌళి బాహుబలి హీరో ప్రభాస్‌ని ఆకాశానికి ఎత్తేశారు.  ‘బాహుబలి-2’ తమిళ వెర్షన్ ఆడియో ఆవిష్కరణ కోసం యూనిట్‌ సభ్యులతో కలిసి ఆదివారం చెన్నైకి వచ్చిన రాజమౌళి చిత్ర విశేషాలను మీడియాతో పంచుకున్నారు.
 
బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడన్న ప్రశ్న తనను ఎంతోమంది అడుగుతున్నారని, అయితే ఎవరూ తన నుండి జవాబు ఆశించడం లేదన్నారు. ‘బాహుబలి’ కొనసాగింపు కథ ఏంటో తెలుసుకొనేందుకు విడుదల కోసం ప్రేక్షకులు ఆతృతగా ఎదురుచూస్తున్నారనీ, అదే తమ తొలి విజయమనీ చెప్పారు. ‘బాహుబలి’ తరువాత వీఎఫ్‌ఎక్స్‌ అవసరం లేని కథతో సినిమా తీయాలనుకుంటున్నానని ఆయన తెలిపారు. సైన్స్ ఫిక్షన్ సినిమా తీసే ఆలోచన ఉందా అనే ప్రశ్నకు.. తనకు భవిష్యత్తు గురించి ఆలోచించడం కంటే గతంలోకి వెళ్లడమే ఇష్టమని రాజమౌళి బదులిచ్చారు.
 
అవార్డుల గురించి తాను సినిమాలు తీయనని, ఒకవేళ వస్తే సంతోషమేనని వ్యాఖ్యానించారు. రజనీకాంత్ - శంకర్‌ సినిమా ‘2.0’తో పోటీ గురించి ప్రశ్నించగా... ఇవి రెండూ వేర్వేరు నేపథ్యాలతో కూడిన చిత్రాలనీ, భారతీయ సినిమా ఖ్యాతిని పెంచే ఈ రెండూ దక్షిణాది నుండి రావడం సంతోషకరమైన విషయమనీ అన్నారు. శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి, శంకర్‌ల నుండే వీఎఫ్‌ఎక్స్‌ ఎలా ఉపయోగించాలో నేర్చుకున్నానని, తనకంటే వారిద్దరూ ఒక మెట్టు పైనే ఉంటారని వినమ్రంగా పేర్కొన్నారు.