Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

పోటీ ఉండాలి... పోటీ లేకుంటే చప్పగా ఉంటుంది : చిరంజీవికి బాలకృష్ణ కౌంటర్

మంగళవారం, 10 జనవరి 2017 (12:59 IST)

Widgets Magazine
balakrishna

నందమూరి బాలకృష్ణ నటించిన వందో చిత్రం "గౌతమిపుత్రశాతకర్ణి". ఈ చిత్రం ఈనెల 12వ తేదీన ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ చిత్రం గురించి బాలకృష్ణ మంగళవారం మీడియాతో మాట్లాడారు. 'గౌతమిపుత్ర శాతకర్ణి' చిత్రంలో పాత్ర చేస్తున్నప్పుడు ఆహార్యం, గెటప్‌లు అదిరిపోయాయని చెప్పారు.
 
ఆ సమయంలో ఎన్టీఆర్, ఎంజీఆర్, శివాజీ గణేశన్ వంటి వారి పాత్రలు చూస్తూ లీనమైపోయాయని చెప్పారు. అందువల్లే ఆ పాత్రలు చేస్తున్నంత సేవు తనలో ఆవేశం, కోపం, రౌద్రం వంటివి ఉన్నాయన్నారు. ముఖ్యంగా.. ఇలాంటి క్యారెక్టర్లు చేస్తున్నప్పుడు మన పూర్వీకులను తలచుకుంటానని చెప్పారు. 
 
ఇకపోతే ఏపీ రాజధాని అమరావతి. 'గౌతమిపుత్ర శాతకర్ణి' అమరావతి రాజు. అయితే, ఈ చిత్రాన్ని ముందుగా ప్లాన్ చేసుకుని చేయలేదన్నారు. యాదృచ్ఛితంగా కలిసి వచ్చిందని బాలయ్య ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. అంటే, ఇలాంటి చిత్రంలో నటించాలని తనను ఏవో శక్తులు ప్రేరేపించినట్టుగా వచ్చాయన్నారు. 
 
అలాగే, సంక్రాంతి సినీ సమరంపై ఆయన స్పందిస్తూ సాధారణంగా ఎక్కడైనా పోటీ అనేది ఉండాలన్నారు. పోటీ లేకుంటే చప్పగా ఉంటుంది. తన ఒక్కడి చిత్రమే ఆడితే.. తానేదో బిల్డప్‌ ఇస్తున్నాడని అనుకుంటారు. అది కాదు పద్దతి. పోటీ ఖచ్చితంగా ఉండి తీరాల్సిందే. అలాగే, ప్రతి సినిమాను ప్రతి ఒక్కరూ చూడాలన్నారు. తనకు ఉండే అభిమానులు తనకు ఉంటారనీ, కానీ కొన్ని పాత్రలు కొందరే చేయగలుగుతారని అందవల్ల ప్రతి ఒక్కరూ ప్రతి అభిమాని చిత్రాన్ని చూడాలన్నారు. 
 
కాగా, మెగాస్టార్ చిరంజీవి తన 150వ చిత్రం "ఖైదీ నంబర్ 150" గురించి సోమవారం మాట్లాడుతూ సంక్రాంతి రేసులో పోటీ అనేది లేదని, కేవలం ఇది ఆరోగ్యకరమైన పోటీ మాత్రమేనని వ్యాఖ్యానించిన విషయం తెల్సిందే. కానీ, బాలయ్య మాత్రం పోటీ ఉండి తీరాల్సిందేనంటూ కౌంటర్ ఇవ్వడం గమనార్హం. 



Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

కొందరు హీరోల్లా డబ్బాలు కొట్టవద్దు.. అర్థమైందా? విష్ణుకు వార్నింగ్ ఇచ్చిన మోహన్‌బాబు

హీరో మోహన్ బాబు. కేవలం విలక్షణమైన నటుడే కాదు. నిజ జీవితంలోనూ చాలా సంస్కారం కలిగిన నేత. ఓ ...

news

"ఖైదీ" సెట్లో గొడవపడి తప్పు చేశా.. సర్దుకపోయుంటే మరోలావుండేది : క్యాథరిన్

కొంతమంది హీరోయిన్ల ప్రవర్తన వారి కెరీర్‌‌ను చేజేతులా నాశనం చేస్తుంది. ఆ తర్వాత తాము చేసిన ...

news

మహాభారతం తీయాలన్నదే నా లక్ష్యం.. బాహుబలి కంటే ఈగ చేయడం పనికొచ్చింది: జక్కన్న

జక్కన్న ఎస్‌.ఎస్‌. రాజమౌళి దర్శకత్వంలో భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్న చిత్రం 'బాహుబలి ...

news

"ఖైదీ నం.150" వర్సెస్ "గౌతమిపుత్ర శాతకర్ణి" : ఈ రెండు చిత్రాల మూల కథల సారాంశమిదే ...

మెగాస్టార్ చిరంజీవి తాజా చిత్రం 'ఖైదీ నంబర్ 150'. నందమూరి బాలకృష్ణ వందో చిత్రం ...

Widgets Magazine