Widgets Magazine Widgets Magazine

బాలకృష్ణ 'బాలీవుడ్' స్టయిల్... షూటింగ్ ప్రారంభం కాకుండానే 101వ చిత్రం రిలీజ్ డేట్!

గురువారం, 9 మార్చి 2017 (12:14 IST)

Widgets Magazine
balakrishna 101th film

యువరత్న నందమూరి బాలకృష్ణ బాలీవుడ్ స్టైల్‌లో ముందుకెళుతున్నారు. తన 101 చిత్రం పూజాకార్యక్రమాలు గురువారం ప్రారంభమయ్యాయి. ఈ చిత్రం ఈనెల 16వ తేదీ నుంచి షూటింగ్ జరుపుకోనుంది. అయితే, ఈ చిత్రం విడుదల తేదీని మాత్రం ముందుగానే ప్రకటించారు. పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్ 29వ తేదీ రిలీజ్ చేస్తామని అధికారికంగా ప్రటించారు. 
 
అంతకుముందు బాలకృష్ణ, దర్శకుడు పూరీ జగన్నాథ్‌ల కాంబినేషన్‌లో తెరకెక్కే 101వ చిత్రానికి గురువారం ఉదయం అంకురార్పణ జరిగింది. హైదరాబాద్, తులసీవనం టెంపుల్‌లోని వెంకటేశ్వరస్వామి ఆలయంలో చిత్ర ప్రారంభ పూజలు జరుగగా, బాలయ్య, పూరీలతో పాటు మరో దర్శకుడు బోయపాటి శ్రీను, కమెడియన్ అలీ తదితరులు పాల్గొన్నారు. భవ్య క్రియేషన్స్ పతాకంపై ఈ చిత్రం నిర్మితమవుతుండగా, స్క్రిప్టును వెంకటేశ్వరుని పాదాలచెంత ఉంచి స్వామి ఆశీర్వాదం పొందారు. స్వామివారికి ప్రత్యేక పూజల అనంతరం చిత్రం షూటింగ్ అధికారికంగా ప్రారంభమైనట్లయింది. 
 
ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ "ఈరోజు భవ్య క్రియేషన్స్ పతాకం మీద ఆనందప్రసాద్ నిర్మాతగా, పూరీ జగన్నాథ్ డైరెక్షన్‌లో మంచి శుభముహూర్తంలో ఈ చిత్రం ప్రారంభమైంది... తులసివనంలో... ఇదొక ఆధ్యాత్మిక క్షేత్రం. అక్కడ స్వామివారి మీద ముహూర్తపు షాట్ తీయడం జరిగింది. అభినందించేందుకు వచ్చిన సినీ పరిశ్రమ ప్రముఖులందరికీ నమస్కారం. ఆనంద ప్రసాద్ ఎంతో ఆధ్యాత్మికత ఉన్న వ్యక్తి. తులసివనం నుంచి తిరుమల దాకా పాదయాత్ర చేయడం జరిగింది. ఆయన నిర్మాతగా ఉండటం నాకెంతో ఆనందంగా ఉంది" అన్నారు. 
 
అలాగే, ఈనెల 16 నుంచి మొదలు పెట్టి ఏకధాటిగా షూటింగ్‌ను కొనసాగిస్తామని నిర్మాత ఆనంద ప్రసాద్ తెలిపారు. సెప్టెంబర్ 29న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తామని అన్నారు. ఈ విషయంలో చాలా మంది మంచి కామెంట్లు చేశారని, బాలీవుడ్ చరిత్రను తెలుగు ఇండస్ట్రీకి తెస్తున్నారని, పూజకాకముందే రిలీజ్ డేటును చెప్పడం మంచి పద్దతని చెబుతున్నారని అన్నారు. డిస్ట్రిబ్యూటర్లు సహకరిస్తున్నారని, షెడ్యూల్స్ చక్కగా సాగేందుకు ఇప్పటికే ప్రణాళికలు జరిగిపోయాయని వెల్లడించారు. ముందే రిలీజ్ తేదీని ప్రకటించడం వల్ల పెద్ద హీరోల చిత్రాల మధ్య పోటీ తగ్గుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

నా పుట్టుకను నా తల్లిదండ్రులు జీర్ణించుకోలేక పోయారు : రేణూ దేశాయ్

రేణూ దేశాయ్.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య. దర్శకురాలు కూడా. ఈమె మహిళా దినోత్సవం ...

news

అందాల విందుకు సిద్ధమంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో టాప్‌లెస్ ఫోటో.. ఎవరా నటి?

ఓ హీరోయిన్ పబ్లిసిటీ కోసం తన న్యూడ్ ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఇది ఇపుడు ...

news

271 రైతు కుటుంబాలకు రాఘవ లారెన్స్ అండ... ఒక్కో ఫ్యామిలీకి రూ.3 లక్షలు చొప్పున...

ప్రకృతి ప్రకోపం వల్ల ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలను ఆదుకునేందుకు కొరియోగ్రాఫర్, ...

news

మగాళ్ళను మహిళలు సన్నీలా సుఖపెట్టాలన్న వర్మ.. కన్నుగీటిన ఎమోజీతో పోర్న్ స్టార్ ఆన్సర్

ప్రపంచంలోని పురుషులకు మహిళలు పోర్న్ స్టార్ సన్నీ లియోన్‌లా సుఖపెట్టాలంటూ వివాదాస్పద ...