మంగళవారం, 16 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By DV
Last Modified: గురువారం, 4 ఫిబ్రవరి 2016 (21:17 IST)

నా హిందూపూర్‌లో 'గుంటూర్ టాకీస్' షూటింగ్ ఆనందంగా వుంది: బాలకృష్ణ

గుంటూరు టాకీస్‌.. అనే చిత్రాన్ని రాజ్‌కుమార్‌ నిర్మిస్తున్నారు. ఈ సినిమా థియేట్రికల్‌ ట్రైలర్స్‌‌ను నందమూరి బాలకృష్ణ చేతుల మీదుగా విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ.. ''వైవిధ్యమైన చలన చిత్రాలను రూపొందించడంలో తెలుగు ఇండస్ట్రీ పెట్టింది పేరు. యువకులందరూ కలిసి చేస్తోన్న ఈ సినిమా ట్రైలర్‌‌ను విడుదల చేయడం సంతోషంగా ఉంది. సినిమా టైటిల్‌ హోమ్లీగా ఉంది. నేను ఎమ్మెల్యేగా సేవలందిస్తున్న హిందూపూర్‌‌లో ఈ సినిమా షూటింగ్‌ జరగడం సంతోషకరం. 
 
ఒక నటునిగా నాకు కూడా వైవిధ్యమైన పాత్రల్లో నటించాలని ఉంటుంది. ఈ సినిమా ట్రైలర్‌ చాలా బాగుంది. మంచి సస్పెన్స్‌ ఉంది. దర్శకుడు ప్రవీణ్‌ సినిమా మీద పేషన్‌ ఉన్న వ్యక్తి. నేషనల్‌ అవార్డును సైతం సొంతం చేసుకున్నాడు. తెలుగు సినిమాకు దొరికిన అతి కొద్దిమంది మంచి నటుల్లో నరేష్‌ ఒకడు. అతను ఈ సినిమాలో ఓ విభిన్నమైన పాత్రను పోషించడం నాకు ఆనందంగా ఉంది. ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను'' అని అన్నారు. 
 
దర్శకుడు ప్రవీణ్‌ సత్తారు మాట్లాడుతూ.. ''అగ్ర కథానాయకులైన బాలకృష్ణగారు మా సినిమా ట్రైలర్‌ లాంచ్‌ కు విచ్చేయడం మాకు కొత్త ఎనర్జీని ఇస్తోంది. ప్రేక్షకులు సినిమాను ఆదరించాలని కోరుకుంటున్నాను'' అని చెప్పారు.