Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

నాన్నగారి జీవిత చరిత్రలో నటిస్తా.. ఎన్టీఆర్ పాత్రధారిని నేనే : నటసింహా బాలకృష్ణ

మంగళవారం, 7 ఫిబ్రవరి 2017 (09:51 IST)

Widgets Magazine
Balakrishna

విఖ్యాత నటసార్వభౌముడు, తెలుగు ఆరాధ్య నటుడు నందమూరి తారక రామారావు జీవిత చరిత్రను సినిమాగా నిర్మించి, అందులో తాను టైటిల్ పాత్రలో నటిస్తానని నటసింహా నందమూరి బాలకృష్ణ ప్రకటించారు. ప్రస్తుతం సినిమా కథాంశం కోసం పరిశోధిస్తున్నామన్నారు. ఎన్టీఆర్ స్వగ్రామం నిమ్మకూరు (కృష్ణా జిల్లా పామర్రు మండలం)లో నారా లోకేష్ సహా సాగించిన పర్యటనలో బాలయ్య పైవిధంగా ప్రకటించారు. 
 
"ఎన్టీఆర్‌ జీవిత విశేషాలను పాఠ్యాంశంగా చేర్చాలి. నాకు నిమ్మకూరు, హిందూపురం రెండూ సమానమే"నని అన్నారు. ఎన్టీఆర్ జీవితకథను ఆధారంగా చేసుకుని సినిమా నిర్మిస్తామని, ఇందులో ఎన్టీఆర్ పాత్రలో తానే నటిస్తానని, ఈ చిత్రంలో నాన్న జీవితానికి సంబంధించిన అన్ని అంశాల్ని చర్చిస్తామన్నారు. బంధువులు, శ్రేయోభిలాషుల నుంచి నాన్నగారికి సంబంధించిన మరిన్ని విశేషాలను సేకరించి కథను సిద్ధం చేస్తామని బాలకృష్ణ చెప్పారు. ఈ సినిమా దర్శకుడు, నిర్మాత వివరాల్ని త్వరలో తెలియజేస్తామన్నారు.
 
అంతకుముందు నిమ్మకూరులో గ్రామంలో 30 పడకల ఆస్పత్రి నిర్మాణానికి భూమిపూజ చేశారు. అలాగే, హిందూపూర్‌లో తన పీఏపై వచ్చిన ఆరోపణలపై విచారణ కొనసాగుతోందన్నారు. పార్టీ క్రమశిక్షణ ఎవరు ఉల్లంఘించినా చర్యలు తప్పవని ఈ సందర్భంగా బాలయ్య హెచ్చరించారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

ఆ రెండు సినిమాలు చేయలేదని ఆయన బాధ!

అటు శృంగార రసాన్ని, భక్తి రసాన్ని రెండు కళ్లుగా భావించుకుని తెలుగు కమర్షియల్ చిత్ర సీమ ...

news

తిరుమలపై మన అవగాహననే మార్చేస్తున్న చిత్రం ‘ఓం నమో వేంకటేశాయ’

నేటి తరానికి, భవిష్యత్‌ తరాలకు మన చరిత్ర గురించి చెప్పాలని ‘అన్నమయ్య’, ‘శ్రీరామదాసు’, ...

news

ఆ సినిమాలు సక్సెస్ అయినప్పుడు నాదెందుకు కాదు: ఎస్3 లేట్‌పై సూర్య

విడుదల కావలసిన సినిమా దాదాపు వంద రోజుల పాటు విడుదల కాకుంటే ఎవరికైనా ముందుగా వచ్చే ...

news

అంధుడి పాత్రలో రవితేజ... చిత్ర విజయంపై దిల్ రాజు భరోసా

‘బెంగాల్‌ టైగర్‌’ వంటి హిట్‌ తర్వాత ఏడాదికి పైగా గ్యాప్‌ తీసుకున్న రవితేజ ఇప్పుడు ...

Widgets Magazine