శుక్రవారం, 29 మార్చి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By DV
Last Modified: శనివారం, 18 మార్చి 2017 (22:32 IST)

వపన్‌ భగత్‌సింగ్‌... బండ్ల గణేష్‌: నిజాయితీపరుడు... టీవీ 9 రవిప్రకాష్‌, ముఖ్యమంత్రి కావాలా?

'కాటమరాయుడు' ఆడియో ప్రి-రిలీజ్‌ ఫంక్షన్‌ శనివారం శిల్పకళావేదికలో జరిగింది. ఆదిత్య మ్యూజిక్‌ ద్వారా పాటలు విడుదలయ్యాయి. పంచెకట్టుతో పవన్‌ హాజరయ్యారు. లుంగీ పంచెతో రామలక్ష్మణ్‌లు హాజరయి... చిత్రం గురించి మాట్లాడుతూ.... రైతు మాట్లాడితే పవర్‌ ఎలా వుంటుంద

'కాటమరాయుడు' ఆడియో ప్రి-రిలీజ్‌ ఫంక్షన్‌ శనివారం శిల్పకళావేదికలో జరిగింది. ఆదిత్య మ్యూజిక్‌ ద్వారా పాటలు విడుదలయ్యాయి. పంచెకట్టుతో పవన్‌ హాజరయ్యారు. లుంగీ పంచెతో రామలక్ష్మణ్‌లు హాజరయి... చిత్రం గురించి మాట్లాడుతూ.... రైతు మాట్లాడితే పవర్‌ ఎలా వుంటుందో.. నడిస్తే స్టయిల్‌ ఎలావుంటుందో.. పంచ్‌ కొడితే ఎలా ఉంటుందో.. పవర్‌ఫుల్‌గా పవన్‌ పోషించారు. ఇందులో మాకు నచ్చిన ఫైట్‌... హీరో పంచెను ఎగరేసి మడిచిపెట్టి చేసిన ఫైట్‌ చిత్రానికి హైలైట్‌గా నిలుస్తుంది. ఇది నలుగురు అన్నదమ్ముల అనుబంధం ఎలా వుంటుందో ఇందులో చూపించారు. అమ్మ సెంటిమెంట్‌ కూడా అద్భుతంగా వుంటుంది' అని చెప్పారు. పవన్‌కు సోదరులుగా అజయ్‌, కమల్‌ కామరాజ్‌, శివబాలాజీ, చైతన్య నటించారు.
 
అలీ మాట్లాడుతూ.... పెద్ద ఎన్‌టిఆర్ సర్దార్‌ పాపారయుడు... మోహన్‌బాబు పెద్దరాయుడు... ఇప్పుడు పవన్ కాటమరాయుడు అంటూ పోల్చారు. సినిమా అంతా చేనేత పంచెలనే పవన్‌ వాడారని పేర్కొన్నారు. త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌, డాలీ, అనూప్‌ రూబెన్స్‌, బండ్ల గణేష్‌, ఆదిత్య ఉమేష్‌ గుప్తా, ఎ.ఎం. రత్నం, మానస, సౌమ్య, రవిప్రకాష్‌, నరేంద్ర చౌదరి తదితరులు పాల్గొన్నారు.
 
రవిప్రకాష్‌ మాట్లాడుతూ... రాజకీయాల్లో భజన చేసే వందిమాగదులు ఈరోజు కన్పిస్తున్నారు. కానీ పవన్‌.. ఏ పదవీ, డబ్బు ఆశించకుండా మంచి పనిచేశారు. డిమానిటైజేషన్‌, ప్రత్యేక హోదాకు ప్రశ్నించిన వ్యక్తి పవన్‌. ఈరోజు యువతరం నిలదీయాల్సి వుంది. కుటుంబం కోసం పరిపాలన సాగిస్తున్నవారిని ప్రశ్నించే హక్కుతో పవన్‌ మాట్లాడుతున్నారు. పవన్‌ స్పూర్తితో యువత అడుగువేయాలని కోరారు.
 
బండ్ల గణేష్‌ మాట్లాడుతూ.... పవన్‌ గురించి ఏం చెప్పమంటారు... టిప్పుసుల్తాన్‌, మహాత్మాగాంధీ, సుభాస్‌ చంద్రబోస్‌.. భగత్‌సింగ్‌ మళ్ళీ పుట్టాడని చెప్పమంటారా.. మనకు చెప్పటాలు లేవు. ఆయన చెప్పింది చేయడమే.. నాకు ఈరోజు ఎంత ఆనందంగా వుందంటే.. టీవీ 9 రవిప్రకాష్‌ మాట్లాడుతుంటే... రక్తం తన్నుకొచ్చింది... మీలాంటి నిజాయితీపరులు ఆయన వెంట వుండాలి. మై నేమ్‌ ఈజ్‌ బండ్ల గణేష్‌. మై గాడ్‌ ఈజ్‌ పవన్‌ కళ్యాణ్‌ అంటూ ముగించారు. మరోవైపు అభిమానుల నుంచి పవన్ కళ్యాణ్ కాబోయే సీఎం అంటూ నినాదాలు వచ్చాయి.