శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : శనివారం, 10 అక్టోబరు 2015 (14:36 IST)

30న నిహారిక సినిమా ఫంక్షన్: మెగా ఫ్యామిలీ అంతా అక్కడే.. పవన్ వస్తారా?

మెగాస్టార్ చిరంజీవి సోదరుడు నాగేంద్ర బాబు తన నిహారిక హీరోయిన్‌గా తెరంగేట్రం చేయనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముహూర్తం కుదిరింది. ఈ నెల 30వ తేదీన నిహారిక నటించబోయే సినిమాను అట్టహాసంగా ప్రారంభించనున్నారు. మెగా ఫ్యామిలీ నుంచి వస్తున్న హీరోయిన్ కావడంతో.. ఈ కార్యక్రమాన్ని గ్రాండ్‌గానే నిర్వహించాలని నిర్ణయించారు.
 
మెగా డాటర్ హీరోయిన్‌గా నటించబోతున్న సినిమాలో హీరోగా నాగశౌర్య నటిస్తున్నాడు. మల్లెల తీరంలో సిరిమల్లెపువ్వు ఫేమ్ రామరాజు ఈ సినిమాకు దర్శకత్వం వహించనుండగా, మధుర శ్రీధర్ -టీవీ9 కలిసి సినిమాను నిర్మించబోతున్నాయి. కాస్టింగ్ ప్రకారం చూస్తే.. ఇది పెద్ద బడ్జెట్ మూవీ కాకపోయినా.. మెగా డాటర్ నీహారిక ఎంట్రీతో బడా సినిమా అయిపోయింది. అందుకే గ్రాండ్ ఫంక్షన్ చేయనున్నారు.
 
 హైటెక్స్ వేదికగా జరిగే ఈ కార్యక్రమానికి చిరంజీవి సహా మెగా ఫ్యామిలీ అంతా రాబోతున్నారని తెలుస్తోంది. నిహారిక తండ్రి నాగబాబు, బ్రదర్స్ రామ్ చరణ్, వరుణ్ తేజ్ -బన్నీ ఇలా అందరూ ఈ ప్రోగ్రాంకి అటెండ్ కాబోతున్నట్లు తెలుస్తోంది. ముకుంద మూవీ ప్రారంభోత్సవంలో వరుణ్ తేజ్ కోసం అప్పట్లో వచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వస్తారో లేదో అనేది ఇంకా తెలియాల్సి వుంది. 
 
ఇకపోతే.. స్టార్ హీరోల ఫ్యామిలీ నుంచి వస్తున్న తొలి హీరోయిన్ నిహారికే అవుతుంది. అప్పుడెప్పుడో పవన్ కళ్యాణ్ పక్కన.. అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయిలో నాగార్జున మేనకోడలు సుప్రియ చేసిన తర్వాత.. మళ్లీ ఏ స్టార్ ఫ్యామిలీ నుంచీ హీరోయిన్ రాలేదు. ఆ రికార్డును నిహారిక బ్రేక్ చేయబోతోంది.