బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By DV
Last Updated : మంగళవారం, 31 మే 2016 (19:07 IST)

''భిక్షగాడు''ను మూడు రోజుల్లో తీసేశారు.. ప్రస్తుతం బ్రహ్మరథం పడుతున్నారు: చదలవాడ

విడుదలైన మూడు రోజులపాటు కలెక్షన్లు లేక కొన్ని థియేటర్లలో 'బిచ్చగాడు' సినిమాను తీసేశారు. నాల్గవరోజునుంచి అనూహ్యంగా ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టడంతో... థియేటర్లను అన్నిచోట్ల పెంచుతూ వచ్చాం. మూడోవారం దాటి నాల్గవవారంలోకి ప్రవేశిస్తున్న మంగళవారంనాడుకూడా విజయవాడలో అన్నిచోట్ల కలెక్షన్లు ఫుల్‌గా వున్నాయని.. మంచి చిత్రానికి ఇది ప్రేక్షకుల బ్రహ్మరథం పట్టారని'' నిర్మాత చదలవాడ శ్రీనివాస్‌ అన్నారు. 
 
విజయ్‌ ఆంటోని, సత్న టైటస్‌ జంటగా నటించిన తమిళ చిత్రం 'పిచ్చైకారన్‌'. శశి దర్శకుడు. ఫాతిమా విజయ్‌ ఆంటోని ఈ చిత్రాన్ని నిర్మించారు. శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిల్మ్స్‌ పతాకంపై చదలవాడ పద్మావతి 'బిచ్చగాడు' టైటిల్‌‌తో తెలుగులో అనువదించారు. ఇటీవల విడుదలయిన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్‌ వస్తోంది. 
 
ఈ సందర్భంగా.. చిత్రబృందం మంగళవారం హైదరాబాద్‌‌లోని సక్సెస్‌ మీట్‌‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విజయ్‌ ఆంటోని మాట్లాడుతూ.. ఈ సినిమాకు బిచ్చగాడు అనే టైటిల్‌ పెట్టినప్పుడు నెగెటివ్‌ ఇంపాక్ట్‌ వస్తుందని అందరూ అన్నారు. కాని ఈ సినిమాకు టైటిల్‌ పెద్ద ప్లస్‌ అయింది. తమిళంలో ఈ సినిమాను ఎంతగా ఆదరించారో.. దానికి మించి తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. రోజు రోజుకి థియేటర్ల సంఖ్య పెరుగుతుంది. స్క్రిప్ట్‌ ను నమ్మి తెలుగులో రిలీజ్‌ చేసిన చదలవాడ శ్రీనివాస్‌ గారికి థాంక్స్‌. నేను తదుపరి చేయబోయే సినిమాల చిత్రీకరణ యాబై శాతం రెండు తెలుగు రాష్ట్రాలలోనే చేయాలని భావిస్తున్నాను'' అని చెప్పారు. 
 
శశి మాట్లాడుతూ.. హ్యూమన్‌ ఎమోషన్స్‌ను దృష్టిలో పెట్టుకొనే ఈ సినిమా చేశాను. తమిళం, తెలుగుకు ఈ సినిమా సూట్‌ అవుతుందా.. అని ఆలోచించలేదు. కథను నమ్మి తీశాను. తెలుగులో పెద్ద మాసివ్‌ హిట్‌ గా నిలిచింది'' అని చెప్పారు.