బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 27 జనవరి 2017 (14:58 IST)

నేను వేటకే వెళ్ళలేదు.. ఇక కృష్ణజింకలను ఎలా చంపగలను?: కోర్టులో సల్మాన్ ఖాన్

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కృష్ణజింకలను వేటాడిన కేసులో భాగంగా శుక్రవారం జోధ్‌పూర్ కోర్టుకు హాజరయ్యారు. 19 ఏళ్ల నాటి ఈ కేసులో సల్మాన్ వాంగ్మూలాన్ని కోర్టు నమోదు చేసుకుంది. ఈ సందర్భంగా సల్మాన్ ఖా

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కృష్ణజింకలను వేటాడిన కేసులో భాగంగా శుక్రవారం జోధ్‌పూర్ కోర్టుకు హాజరయ్యారు. 19 ఏళ్ల నాటి ఈ కేసులో సల్మాన్ వాంగ్మూలాన్ని కోర్టు నమోదు చేసుకుంది. ఈ సందర్భంగా సల్మాన్ ఖాన్ తాను నిర్దోషినని, తనమీద తప్పుడు ఆరోపణలు చేశారని.. అసలు నేను వేటకే వెళ్లలేదని సల్మాన్ ఖాన్ కోర్టుకు తెలిపారు. భద్రతా కారణాలతో సినిమా షూటింగ్ తర్వాత తాను నేరుగా హోటల్ గదికి వచ్చి విశ్రాంతి తీసుకున్నానని సల్మాన్ ఖాన్ చెప్పారు. 
 
ఇకపోతే.. ఈ కేసుకు సంబంధించి 25మంది సాక్ష్యాల ఆధారంగా రూపొందించిన మొత్తం 65 ప్రశ్నలకు సల్మాన్ సమాధానం చెప్పినట్లు తెలుస్తోంది. అటవీ శాఖ అధికారులు కుమ్మక్కై పబ్లిసిటీ కోసం తనపై తప్పుడు ఆరోపణలు చేశారని సల్మాన్‌ పేర్కొన్నారు. సల్మాన్‌తో పాటు సైఫ్‌ అలీ ఖాన్‌, సోనాలిబింద్రే, టబులు కూడా ఈ కేసులో సహనిందితులుగా ఉన్నారు.
 
కాగా జింకల్ని వేటాడిన కేసులో రాజస్థాన్‌ హైకోర్టు గత ఏడాది జూలైలో నిర్ధోషిగా తేల్చింది. సల్మాన్‌ జింకలను వేటాడాడనడానికి కచ్చితమైన ఆధారాలేవీ లేవని కోర్టు తెలిపింది. 1998 సెప్టెంబర్‌ 26,27 తేదీల్లో భవాద్‌ గ్రామంలో ఒక జింకను, అదే నెల 28,29 తేదీల్లో మథానియాలో మరో జింకను సల్మాన్‌ వేటాడినట్టు ఆరోపణలొచ్చాయి. దీనిపై అప్పట్లో సల్మాన్‌పై రెండు కేసులు నమోదయ్యాయి. 
 
కాగా రెండు కేసుల్లో ట్రయల్‌ కోర్టు సల్మాన్‌ఖాన్‌కు జైలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పులు వెలువరించింది. 2006 ఫిబ్రవరి 17న వెలువరించిన తీర్పులో సంవత్సరం జైలు శిక్ష, 2006 ఏప్రిల్‌ 10న వెలువరించిన జింకల వేట కేసులో సల్మాన్‌ నిర్దోషి తీర్పులో ఐదు సంవత్సరాల జైలు శిక్ష విధించింది. కిందికోర్టు తీర్పులను సవాల్‌ చేస్తూ సల్మాన్‌ హైకోర్టును ఆశ్రయించాడు. సల్మాన్‌ వేసిన రెండు పిటిషన్లను 2015 నవంబర్‌ 16న హైకోర్టు విచారణకు స్వీకరించింది. కాగా ఈ పిటిషన్లపై విచారణ మే 13న పూర్తవగా జూలైలో తీర్పు వెలువరించింది.