గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : బుధవారం, 1 జులై 2015 (17:58 IST)

సునీల్ సరసన బాలీవుడ్ హీరోయిన్: ప్రచీ దేశాయ్‌తో రొమాన్స్

మర్యాద రామన్న హీరో సునీల్ సరసన పాపులర్ బాలీవుడ్ తార ప్రచీ దేశాయ్ నటించనుంది. కమెడియన్ టర్న్డ్ హీరో సునీల్ వంశీ ఆకెల్ల దర్శకత్వంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం ప్రచీ హీరోయిన్‌గా ఎంపికైందని టాలీవుడ్ వర్గాల సమాచారం. త్వరలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. 
 
ప్రచీ దేశాయ్ ఏక్తా కపూర్ సూపర్ హిట్ హిందీ టీవీ సిరీస్‍‌లో నటించింది. ఇంకా మ్యూజికల్ డ్రామా రాక్ ఆన్, ఒన్స్ ఆపాన్ ఎ టైమ్ ఇన్ ముంబై, బోల్ బచ్చాన్, ఏక్ విలన్ వంటి సినిమాల్లో నటించింది. ప్రస్తుతం రాక్ ఆన్ సీక్వెల్.. రాక్ ఆన్ 2లో నటిస్తోంది. ఈ మూవీ 2016లో రిలీజ్ కానుంది.