Widgets Magazine

ఎమ్మెల్యే రోజాతో "జీఎస్టీ" సినిమా తీస్తానంటున్న దర్శకుడు!

సోమవారం, 29 జనవరి 2018 (17:04 IST)

Ajay Kaundinya

ఇటీవల వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ గాడ్, సెక్స్ అండ్ ట్రూత్ (జి.ఎస్.టి) పేరుతో ఓ వెబ్ సిరీస్ మూవీని తీశారు. ఈ మూవీ ఇటీవలే సోషల్ మీడియాలో విడుదలైంది. ఇపుడు ఇలాంటి చిత్రాన్నే వైకాపా ఎమ్మెల్యే, ఒకనాటి హీరోయిన్ ఆర్.కె.రోజాతో తీస్తానని దర్శకుడు అజయ్ కౌండిన్య సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు ఇపుడు టాలీవుడ్‌లో దుమారం రేపుతున్నాయి. 
 
తెలుగు 'బూత్ బంగ్లా' చిత్ర దర్శకుడు అజయ్ కౌండిన్య. ఈ చిత్రానికి సంబంధించిన ఓ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ, వైసీపీ ఎమ్మెల్యే రోజా ఒప్పుకుంటే... ఆమెను పెట్టి 'గాడ్, సెక్స్ అండ్ ట్రూత్' సినిమా తీస్తానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ కల్యాణ్‌పై కూడా విమర్శలు గుప్పించారు. గతంలో తాను తీసిన సినిమాలు థియేటర్లు దొరకక, విడుదలకు కూడా నోచుకోలేదని గుర్తు చేశారు. 
 
సీనియర్ నటి అయిన ఎమ్మెల్యే రోజాకు పాదాభివందనమన్నారు. ప్రపంచంలో ఉన్న ప్రతి సమస్య గురించి మాట్లాడే రోజా... సినిమా పరిశ్రమలోని సమస్యల గురించి మాత్రం మాట్లాడదని మండిపడ్డారు. ఇండస్ట్రీలో ఉన్న అమ్మాయిలు, టెక్నీషియన్లు ఇలా ఎందరో ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నా ఆమె ఏమీ చేయడం లేదన్నారు. రాంగోపాల్ వర్మ విదేశీ నటిని పెట్టి సినిమా తీశారని... రోజాను పెట్టి తీసుంటే బాగుండేదని అన్నాడు. రోజా ఒప్పుకుంటే ఆమెను పెట్టి 'గాడ్, సెక్స్ అండ్ ట్రూత్ పార్ట్ 2' సినిమా తీస్తానంటూ వ్యాఖ్యానించారు. 
 
ఇక పవన్ కల్యాణ్‌పై కూడా కౌండిన్య మండిపడ్డాడు. ఎన్నో సమస్యలపై ప్రశ్నించే పవన్... సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రశ్నించరా? అని నిలదీశారు. కేసీఆర్‌కు క్షమాపణలు చెప్పుకోవడానికే ఆయన ఇంటికి పవన్ వెళ్లారని చెప్పాడు. అలాగే, సినీ పరిశ్రమ కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో చేస్తుంటే... సినిమాటోగ్రఫీ మంత్రి మాత్రం ఎలాంటి చలనం లేకుండా ఉన్నారని అజయ్ మండిపడ్డారు. ఈ మూడేళ్ల కాలంలో ప్రభుత్వానికి సినీరంగం రూ. 600 కోట్ల ట్యాక్స్ కట్టిందని... కానీ, కేసీఆర్ అనౌన్స్ చేసిన ఏ ఒక్క పనీ అమలుకు నోచుకోలేదని అన్నాడు. 
 
ఒక ఆడ, మగా తేడా తెలియని ఓ అమ్మాయి గురించి మాట్లాడతానని... ఆమె గాయత్రి గుప్తాఅని కౌండిన్య తెలిపారు. సినీపరిశ్రమలో అమ్మాయిలను నిర్మాత, దర్శకులు వాడుకుంటారని ఆమె ఓ టీవీలో మాట్లాడుతూ చెప్పిందని మండిపడ్డారు. సినీ పరిశ్రమలో జరిగేది ఏందో తెలిసి కూడా ఇలాంటి విషయాలు మాట్లాడతావా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. 


Widgets Magazine
Widgets Magazine

దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

ఒకే వేదికపై కంగన-కరణ్: నా లవ్‌స్టోరీ గురించి అందరికీ బాగా తెలుసు..

బాలీవుడ్ సెలెబ్రిటీలు కంగనా రనౌత్, కరణ్ జోహార్ అంటేనే వీరిద్దరికీ పొసగదని అందరూ అనుకుంటూ ...

news

రాజమౌళి మల్టీస్టారర్ చిత్రంలో విలన్‌గా పాపులర్ హీరో !

దర్శక ధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి "బాహుబలి" తర్వాత ఓ మల్టీస్టారర్ చిత్రాన్ని చేయనున్నారు. ఈ ...

news

రాజమౌళి మల్టీస్టారర్‌లో విలన్‌గా యంగ్ హీరో.. ఆయనెవరో?

బాహుబలి 2 సినిమాకు తర్వాత జక్కన్న రాజమౌళి.. మల్టీస్టారర్ సినిమాపై కన్నేశాడు. ఈ ...

news

భారతీయ చిత్రాల వల్లే అత్యాచారాలు : పాకిస్థాన్ యూత్

భారతీయ చిత్ర పరిశ్రమ(బాలీవుడ్) వల్లే తమ దేశంలో అత్యాచారాలు పెరుగుతున్నాయని పాకిస్థాన్ ...

Widgets Magazine