Widgets Magazine

రూ.కోట్లు ఇచ్చా.. ప్లీజ్ నాపేరు చెడగొట్టొద్దు... బ్రాడ్ పిట్

శుక్రవారం, 10 ఆగస్టు 2018 (10:33 IST)

తన మాజీ భార్య ఏంజెలినా జోలీకి హాలీవుడ్ నటుడు బ్రాట్ పిట్ ఓ విజ్ఞప్తి చేశాడు. పిల్లల సంరక్షణార్ధం ఇప్పటికే రూ.61 కోట్లు ఇచ్చాననీ, డబ్బు ఇవ్వలేదనీ కోర్టుకెక్కి తన పేరు చెడగొట్టొద్దంటూ ప్రాధేయపడ్డాడు.
brad pit - joli
 
హాలీవుడ్ సెలబ్రిటీ జంట ఏంజెలినా జోలీ, బ్రాడ్ పిట్‌లు సుమారుగా 11 యేళ్ళ పాటు సహజీవనం చేయగా, వీరికి నలుగురు పిల్లలు. మరో ఇద్దరు పిల్లలను దత్తత తీసుకున్నారు. దీంతో మొత్తం ఆరుగురు పిల్లలు. 
 
అయితే, వీరిద్దరూ 2016 సెప్టెంబరులో విడిపోయారు. అపుడు తాగుడుకు బానిసైన పిట్.. పిల్లల్ని కొట్టడంతో ఏంజెలినా విడాకులు తీసుకుంది. ఈ సందర్భంగా కోర్టు ఆరుగురు పిల్లల సంరక్షణను ఏంజెలినాకే అప్పగించింది. 
 
ఆ సమయంలో కుటుంబ పోషణ, పిల్లల కోసం బ్రాడ్ పిట్ రూ.61 కోట్లు ఇచ్చాడట. కానీ, ఏంజెలినా జోలీ మాత్రం మరోలా ఆరోపిస్తోంది. తనకు తగినంత నగదు ఇవ్వలేదని తాజాగా కోర్టును ఆశ్రయించింది. 
 
దీనిపై పిట్ స్పందించాడు. విడాకుల సమయంలో జోలీకి రూ.61 కోట్లు(9 మిలియన్ డాలర్లు) ఇచ్చానని చెప్పాడు. తన పేరు చెడగొట్టేందుకే జోలీ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తోందని ఆవేదన వ్యక్తంచేశాడు. కాగా, చిన్నారులను తనకూ జాయింట్ కస్టడీకి ఇవ్వాలని పిట్ న్యాయస్థానంలో పిటిషన్ దాఖలుచేశాడు. దాదాపు 11 ఏళ్ల పాటు ఈ జంట సహజీవనం చేసింది. 


Widgets Magazine
Widgets Magazine

దీనిపై మరింత చదవండి :  
ఏంజెలినా జోలీ కోర్టు పిల్లలు సంరక్షణ Support Court బ్రాడ్ పిట్ Child House Loan Brad Pitt Angelina Jolie

Loading comments ...

తెలుగు సినిమా

news

గోరక్షణ పేరుతో దాడులా? ఇడియట్సే ఆ పని చేస్తారు : కంగనా రనౌత్

జంతువుల పేరుతో దాడులు జరిపేవారిని ఇడియట్స్ కిందే పరిగణిస్తారని బాలీవుడ్ హీరోయిన్ కంగనా ...

news

జీవిత భర్త డాక్టర్ రాజశేఖర్‌కు 'తార'తో అక్రమ సంబధమా?

తారా చౌదరి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒకపుడు మీడియాలో హాట్‌ టాపిక్‌గా మారింది. ...

news

నరేంద్ర మోదీ 'చలో జీతే హై' చిన్ననాటి సంగతులు... చూసిన సచిన్, ముకేష్ అంబానీ

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చిన్ననాటి సంఘటనలు స్ఫూర్తితో తెరకెక్కిన చలో జీతే హై చిత్రాన్ని ...

news

గాయనీగాయకులకు కూడా రాయల్టీ

ఇండియన్ సింగర్స్ రైట్స్ అసోసియేషన్- ఇస్రా బుధవారం నాడు హైదరాబాద్‌లో సమావేశాన్ని ...

Widgets Magazine