బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By DV
Last Updated : మంగళవారం, 22 సెప్టెంబరు 2015 (10:57 IST)

‘బ్రూస్‌లీ’.. అక్టోబర్ 16న విడుదల: చిరంజీవి ఫ్యాన్స్‌‌కు పండగే పండగ

‘బ్రూస్‌లీ’.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, శ్రీనువైట్ల దర్శకత్వంలో భారీ ఎత్తున రూపొందుతోన్న సినిమా. బాహుబలి, శ్రీమంతుడు లాంటి రెండు బ్లాక్‌బస్టర్స్ తర్వాత తెలుగులో ఆ స్థాయి సినిమాగా ప్రచారం పొందుతూ వస్తోన్న సినిమా కావడంతో బ్రూస్‌లీపై అంతటా విపరీతమైన అంచనాలు ఉన్నాయి. ఇక ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, ట్రైలర్స్ కూడా సినిమాపై ఆసక్తిని పెంచేస్తున్నాయి. దసరా కానుకగా ఈ సినిమాను అక్టోబర్ 16న విడుదల చేసేందుకు సినిమా యూనిట్ సన్నాహాలు చేస్తోన్న విషయం తెలిసిందే.
 
కాగా సినిమా రిలీజ్ డేట్ దగ్గరవుతున్నా కూడా బ్రూస్‌లీ ఆడియో రిలీజ్ డేట్‌పై క్లారిటీ రాకపోవడంతో, ఆడియో రిలీజ్ ఎప్పుడూ అనే ప్రశ్న అభిమానులను తొలుస్తోంది. ఇక ఇప్పటివరకూ ఒకటి రెండు డేట్స్ వినిపించగా, తాజాగా ఒక ఫైనల్ డేట్‌ను ఫిక్స్ చేసేశారు. 
 
అక్టోబర్ 2న బ్రూస్‌లీ ఆడియో వేడుక జరగనుందని సినిమా యూనిట్ అఫీషియల్‌గా తెలిపింది. మెగా ఫ్యామిలీ హీరోల సమక్షంలో భారీ ఎత్తున ఈ వేడుక జరగనుందని తెలుస్తోంది. మెగాస్టార్ చిరంజీవి ఓ గెస్ట్ రోల్‌లో కనిపించనున్న ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా నటిస్తున్నారు.