నటి జ్యోతిక బుక్కయ్యారు... (వీడియో)

శనివారం, 25 నవంబరు 2017 (13:19 IST)

Nachiyaar jyothika

ఒకపుడు ఇటు తెలుగు, అటు తమిళ చిత్రపరిశ్రమల్లో ఓ వెలుగు వెలిగిన హీరోయిన్ జ్యోతిక. ఆ తర్వాత తమిళ హీరో సూర్యను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఇపుడు ఈమె ఇద్దరు పిల్లలకు తల్లి. గత కొన్ని రోజులుగా గృహిణింగా ఉంటూ వచ్చిన జ్యోతిక.. ఇటీవలే నాచియార్ అనే చిత్రంలో నటిస్తున్నారు. 
 
జ్యోతిక కీలక పాత్ర పోషించిన ఈ చిత్రం టీజర్ ఇటీవల విడుదలైంది. ఇందులో ఓ కేసు విచారణలో భాగంగా బూతుపదాలను ఉపయోగించారు. ఇది సంచలనమైంది. ఇదే అంశంపై కోయంబ‌త్తూరుకి చెందిన ఓ వ్య‌క్తి స్థానిక పోలీసు స్టేష‌న్‌లో ఫిర్యాదు చేశాడు. డ్రైవ‌ర్‌గా ప‌నిచేసే రాజ‌న్, టీజ‌ర్‌లో జ్యోతిక వాడిన ప‌దాలు మ‌హిళ‌ల గౌర‌వాన్ని కించ‌ప‌రిచేలా ఉన్నాయ‌ని త‌న ఫిర్యాదులో పేర్కొన్నాడు. 
 
ఇప్పుడు ఆ టీజ‌ర్ సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తోంద‌ని, స‌మాచార సాంకేతిక చ‌ట్టం సెక్ష‌న్ 67 ప్ర‌కారం అది త‌ప్పు అని రాజ‌న్ పిటిష‌న్‌లో తెలిపాడు. అలాగే ఐపీసీ సెక్ష‌న్ 294బి ప్ర‌కారం కూడా బూతుల‌ను మాట్లాడ‌టం శిక్షార్హం. 'నాచియార్‌' చిత్రంలో పోలీసు అధికారిగా న‌టిస్తున్న జ్యోతిక, దోషిని విచారించే క్ర‌మంలో బూతు వాడ‌టం టీజ‌ర్‌లో ఉంది. ఈ చిత్రానికి బాలా ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. 

 దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

కాశీ ఆలయం నుంచి పవన్ సినిమా టైటిల్ విడుదల..

పవర్ స్టార్ పవన్ కల్యాణ్, మాటల మాంత్రికుడు శ్రీనివాస్ కాంబినేషన్‌లో ఓ సినిమా ...

news

సైరా నరసింహారెడ్డిలో పవన్ కల్యాణ్..

మెగాస్టార్ చిరంజీవి నటించే సైరా సినిమాలో పవర్ స్టార్ పవన్ కనిపించబోతున్నారని ఫిలిమ్ నగర్ ...

news

నయనతార కన్నా నాది తక్కువేం కాదంటోన్న రకుల్‌ప్రీత్ సింగ్

తెలుగు, తమిళ సినీ పరిశ్రమలో రెమ్యునరేషన్ బాగా తగ్గిపోతోందంటోంది రకుల్ ప్రీత్ సింగ్. ఎంత ...

news

పవర్ స్టార్ అంతేమరి... చిరు సతీమణి సురేఖ ఆనందంతో కన్నీటి పర్యంతమయ్యారట...

మెగా ఫ్యామిలీ. చిత్ర పరిశ్రమలో పరిచయం అక్కర్లేని పేరు. చిరంజీవి స్వయంకృషి ఫలితంగా చిన్న ...