శుక్రవారం, 29 మార్చి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : గురువారం, 1 అక్టోబరు 2015 (17:57 IST)

కోలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్‌తో కేథరిన్ డేటింగ్: ఎవరాతను?

2013లో రిలీజైన అల్లు అర్జున్ ఇద్దరమ్మాయిలతో సినిమాలో టాప్ లేచిపోద్ది అంటూ చిందేసిన కేథరిన్ ప్రస్తుతం కోలీవుడ్‌లో బిజీ బిజీగా ఉంది. రుద్రమదేవి సినిమాలో అనామికా దేవిగా నటిస్తున్న కేథరిన్... కోలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్‌తో డేటింగ్ చేస్తుందని తమిళ మీడియా కోడైకూస్తోంది. తమిళ, తెలుగు, మలయాళ సినిమాల్లో మంచి పేరు కొట్టేసిన కేథరిన్.. తమిళ సినిమా ఆఫర్లతో దూసుకెళ్తోంది. 
 
ఇంకా ప్రొడ్యూసర్లను, హీరోలను ఇంప్రెస్ చేసేందుకు నానాతంటాలు పడుతున్న కేథరిన్.. టాప్ ప్రొడ్యూసర్‌తో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతుందని తెలిసింది. ఈ మధ్య ఆ టాప్ ప్రొడ్యూసర్‌తో కలిసి హాలిడే ట్రిప్ కూడా వెళ్ళిందట. ఆ హాలిడే ట్రిప్‌కు సంబంధించిన వీడియో కూడా కోలీవుడ్‌లో సంచలనం సృష్టించింది. అయితే ఈ వార్తల్ని కేథరిన్ ఖండించింది. సినిమా షూటింగ్‌లో భాగంగానే నిర్మాతతో కలిసి ఫోటోలు తీయించుకున్నానని చెప్పింది. ఆ వీడియో కూడా ఉత్తుత్తిదేనని చెప్పుకొచ్చింది.