శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By DV
Last Updated : శుక్రవారం, 24 జులై 2015 (14:06 IST)

ఐదుగురు దర్శకులు ఖరారు: అలా చేస్తే స్వాతిముత్యం లాంటి సినిమాలొస్తాయ్!

రియల్‌ఎస్టేట్‌ రంగం నుంచి సినీ నిర్మాతగా పలు చిత్రాలు నిర్మించి, దర్శకత్వం కూడా చేసిన సాయి వెంకట్‌, ఇటీవలే ఛాంబర్‌ ఎన్నికల్లో పోటీ చేసి ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఒకప్పుడు ఎ.పి. ఫిలిం ఛాంబర్‌ వుండేది. అది కాస్త తెలుగు ఫిలింఛాంబర్‌గా ఏర్పడిన తర్వాత వచ్చిన మొదటి ఎన్నికల్లో ఛాంబర్‌ కార్యదర్శిగా ఎన్నికయ్యాను. చిన్ననిర్మాతలంతా వారికి తగిన సహాయసహకారాలు అందిస్తారని నన్ను గెలిపించారు. ఈ సందర్భంగా వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
 
అలాగే ప్రతిభ వున్న వారిని ప్రోత్సహించాలనే వుద్దేశ్యంతో ఓ బ్యానర్‌ను స్థాపించి సినిమాలను నిర్మించాలనుకుంటున్నాను. ఈ బేనర్‌పై ఒకేసారి పది చిత్రాలను ప్రారంభించి సరికొత్త రికార్డును సృష్టించాలనుకుంటున్నాను. ప్రతిభను ప్రోత్సహిస్తే శంకరాభరణం, స్వాతిముత్యం వంటి చిత్రాలు వస్తాయి. కొత్త దర్శకులు, రచయితలు, సాంకేతిక సిబ్బంది వస్తే తెలుగులో మరిన్ని వినూత్నమైన సినిమాలు వస్తాయి. 
 
ఇప్పటికి 200మంది దర్శకులు తమ కథల్తో నన్ను సంప్రదించారు. అదులో 20మంది మాత్రమే భిన్నమైన కథలతో వచ్చారు. అందులో ఐదు కథలను ఎంపిక చేశాం. ఐదుగురు దర్శకులూ ఖరారయ్యారు. మిగతా దర్శకుల్ని కూడా ఎంచుకున్నాక ప్రారంభోత్సవం చేస్తాం. వాటి చిత్రీకరణ తర్వాత ఒకేసారి ఆడియోను, ఒకే రోజు సినిమా విడుదలను చేసేలా సన్నాహాలు చేస్తున్నామని' తెలిపారు.