Widgets Magazine

చెన్నై 'బట్ట బాబ్జీ'గాడు బాగా వాడేసుకున్నాడు... శ్రీరెడ్డి

మంగళవారం, 15 మే 2018 (17:05 IST)

నటి శ్రీరెడ్డి చెపుతున్న షాకింగ్ విషయాలతో టాలీవుడ్ క్యాస్టింగ్ కౌచ్ గురించి విపరీతంగా చర్చకు వచ్చిన సంగతి తెలిసిందే. ఆమె వివిధ చానళ్లకు, సైట్లకు దీనిపై ఇంటర్వ్యూలు ఇస్తోంది. ఇటీవలే క్యాస్టింగ్ కౌచ్ గురించి చెన్నైకు చెందిన ఓ వ్యక్తి ఎలా తనను ఇబ్బందిపెట్టాడో వివరించింది. ఆమె మాటల్లోనే... ఈ విషయాన్ని ఇప్పటివరకూ నేను ఎవరికీ చెప్పలేదు.
sri reddy
 
నా పర్సనల్ ఇష్యూ. టాలీవుడ్ ఇండస్ట్రీలో హిట్స్ కొట్టిన నిర్మాతకు ఓ స్నేహితుడున్నారు. అతని ద్వారా తమిళ ఇండస్ట్రీలో ట్రై చేయమన్నారు. ఐతే అక్కడికి వెళ్లాక తెల్సింది అతడి అసలు అవతారం. అతడికి కామము ఆ స్థాయిలో వుందని నాకు తెలీదు. నేను చెన్నైలో దిగ్గానే నాకు దుస్తులు కొనేందుకు షాపింగ్ కూడా అతనే చేశాడు.
 
ఆ రోజు సాయంత్రం ఖాళీగా వున్నాము. హోటలుకెళ్లి బాగా మందుకొట్టాడు. అతడిని చూసి ఎక్కువవుతున్నారు, ఇంటికెళ్దామని అన్నాను. ఎంతో పట్టుబట్టాక కానీ అతడు కదల్లేదు. హోటల్ గదికి వచ్చాక నన్ను పిలిచి తలుపు వేసుకోకు... ఇప్పుడే వస్తాను అన్నాడు... నాకు వెంటనే బల్బు వెలిగింది. అందుకే మెల్లిగా తలుపు గడియపెట్టాను. 
 
కొద్దిసేపు ఆగాక తలుపులు కొడుతూనే వున్నాడు. నేను మాత్రం తలుపులు తీయనేలేదు. తెల్లారాక నేను నన్ను ఇక్కడికి పంపిన ప్రొడ్యూసర్ భార్యకు ఫోన్ చేశాను. ఆమె బాగా తిట్టి వెంటనే ఆ బట్ట బాబ్జీగాడితో సంబంధాలు కట్ చేసుకోవాలని టాలీవుడ్ నిర్మాతతో చెప్పింది. ఐతే తల మీద ఒక్క వెంట్రుక కూడా లేని ఆ బట్ట బాబ్జీగాడు నా ఫ్రెండును బాగా వాడేసుకున్నాడు" అని చెప్పింది.


Widgets Magazine
Widgets Magazine

దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

సినిమా టిక్కెట్టు కొనుక్కుని సినిమా చూసే పరిస్థితి లేదుగా: మహానటిపై జమున

అలనాటి అందాల తార సావిత్రి జీవిత కథతో తెరకెక్కిన ''మహానటి'' చిత్రం ప్రస్తుతం ప్రముఖుల ...

news

ఆ హీరోయిన్‌కు జక్కన్న మల్టీస్టారర్‌లో ఛాన్స్.. ఆ కథానాయిక ఎవరు?

మెగాస్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో బాహుబలి మేకర్ రాజమౌళి భారీ మల్టీస్టారర్ ...

news

''లవర్స్'' కోసం శ్రీనివాస కల్యాణం వెనక్కి.. ఎందుకు?

శతమానం భవతి లాంటి ఘన విజయం తరువాత దర్శకుడు సతీష్ వేగేశ్న రూపొందిస్తున్న మరో ఫ్యామిలీ ...

news

శ్రీదేవి బ‌యోపిక్ గురించి వ‌ర్మ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

టాలీవుడ్‌లో ఇప్పుడు బ‌యోపిక్‌ల ట్రెండ్ న‌డుస్తోంది. మ‌హాన‌టి సావిత్రి బ‌యోపిక్ ...

Widgets Magazine