Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

హైదరాబాద్ యువతిపై చెన్నై ఎక్స్‌ప్రెస్ నిర్మాత రేప్... రేప్ వీడియోలు చూపిస్తూ బ్లాక్ మెయిలింగ్

గురువారం, 16 మార్చి 2017 (15:40 IST)

Widgets Magazine

బాలీవుడ్ ఖాన్ త్రయంలో ఒకరైన షారూఖ్ ఖాన్, అందాల ముద్దుగుమ్మ దీపికా పదుకునే జంటగా నటించిన 'చెన్నై ఎక్స్‌ప్రెస్' సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ చిత్రానికి కరీమ్ మొరానీ నిర్మాత. ఈ నేపథ్యంలో ఢిల్లీకి చెందిన ఓ యువతి కరీమ్ మొరానీపై రేప్ కేసు పెట్టింది. అదీ హైదరాబాద్ హయత్ నగర్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టింది. 
 
సినిమా ఛాన్స్ ఇప్పిస్తానని చెప్పి.. తనపై అత్యాచారం చేశాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ కేసుపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. కరీమ్ మొరానీ తనను సినిమాలో అవకాశం ఉందంటూ పిలవడంతో 2015లో తాను ఢిల్లీ నుంచి ముంబై వచ్చానని తెలిపింది. సదరు నిర్మాత తన స్నేహితురాలి తండ్రి కావడంతో అతనిని నమ్మి అవకాశం కోసం ముంబై వచ్చానని చెప్పింది. అయితే హోటల్‌కు భోజనం కోసం రావాల్సిందిగా ఫోన్ చేసిన కరీమ్.. ఆరోజు సాయంత్రం వైన్ బాటిల్‌తో రూమ్ కొచ్చి తన చేత మద్యం తాగించాడని తెలిపింది. 
 
ఆ వైన్‌లో ఏం కలిపాడో తెలియదని.. మగతలోకి జారుకున్నాక అత్యాచారం చేశాడని చెప్పుకొచ్చింది. పొత్తికడుపులో నొప్పితో ఫోన్ చేస్తే వెకిలిగా నవ్వుతూ తన అశ్లీల ఫోటోలు పంపాడని చెప్పింది. దీంతో షాక్ తిని.. పోలీసులను ఆశ్రయించినట్లు బాధిత మహిళ తెలిపింది. ఈ విషయం బయటికి చెప్తే చంపేస్తానని బెదిరించాడని.. తనకు రక్షణ కల్పించాల్సిందిగా పోలీసులను కోరినట్లు బాధితురాలు తెలిపింది. 
 
బాధితురాలి ఫిర్యాదు మేరకు రేప్ అండ్ బ్లాక్ మెయిలింగ్ చేసిన కారణంగా మొరానీపై ఐపీసీ సెక్షన్ 417, 376, 342, 506 విభాగాల కింద కేసులు నమోదు చేసినట్లు పోలీసులు చెప్పారు. 2015 సెప్టెంబర్ - అక్టోబర్ వరకు పలుమార్లు తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడని బాధితురాలు తెలిపింది. కాగా మార్చి 22 తేదీలోపు మొరానీ లొంగిపోవాల్సిందిగా హైదరాబాద్ కోర్టు ఆదేశించింది. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

'బాహుబలి 2' ట్రైలర్‌ 'వ్యూస్' సునామీ... అందరికీ ‘మిలియన్’ ధన్యవాదాలు.. రాజమౌళి ట్వీట్ (Trailer)

'బాహుబలి 2' ట్రైలర్ కోసం చాలా రోజులుగా అభిమానులు ఎదురుచూస్తున్నారు. గురువారం ఉదయం ఈ ...

news

బాహుబలి 2 ట్రెయిలర్ పైన జూ.ఎన్టీఆర్ షాకింగ్ ట్వీట్... మీ ఊపిరి ఆగిపోతుంది...

బాహుబలి 2 ట్రైలర్ విడుదలైన కొద్ది గంటల్లోనే దానిని చూస్తున్నవారి సంఖ్య విపరీతంగా ...

news

"నేను చాలా సిన్సియర్‌ మనిషిని... ప్రభాస్‌లా కాదు" : దగ్గుబాటి రానా (Baahubali-2 trailer video)

ప్రపంచ వ్యాప్తంగా సినీ ప్రేక్షకులంతా ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తూ వచ్చిన "బాహుబలి 2 ...

news

సినీ ఛాన్సుల కోసం పడక గదుల్లోకి వెళ్లే టైపు కాదు : హీరోయిన్ ఇలియానా

చిత్ర పరిశ్రమకు చెందిన మరో టాప్ హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు చేసింది. సినిమా అవకాశాల కోసం పడక ...

Widgets Magazine