శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By DV
Last Modified: శనివారం, 1 ఆగస్టు 2015 (16:17 IST)

చిరంజీవి పుట్టినరోజు వారోత్సవాలకు అభిమానులు సన్నాహాలు

చిరంజీవి జన్మదిన వారోత్సవాలను ఆయన అభిమానులు నిర్వహిస్తున్నారు. ఇందుకు సంబంధించిన కార్యక్రమాలు సిద్ధమవుతున్నాయి. ప్రతి జిల్లాకు చెందిన నాయకులంతా ఇందుకు సన్నద్ధం చేస్తున్నారు. ఆగస్టు 22న ఆయన పుట్టినరోజు.. 15వ తేదీ నుంచి అంటే స్వాతంత్య్ర దినోత్సవం రోజు నుంచి ఆరంభిస్తున్నారు. 15వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా లక్ష మొక్కలు నాటడం, 16వ తేదీన అన్నిచోట్ల రక్తదాన శిబిరాలు, ఇందుకోసం 25 వేల మంది స్వచ్చంధ రక్తదాన శిబిరాలు, ప్రతి జిల్లాలో వెయ్యిమందితో రక్తదానం చేయించడం.
 
17వ తేదీన 'చిరు అన్నదానం' పేరుతో రాష్ట్రవ్యాప్తంగా లక్షమంది పేదలకు అన్నదానం. జిల్లాకు 5వేల మంది అన్నదానం.. 18వ తేదీన గోమాతలకు రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక పూజలు, పేద మహిళలకు చీరలు పంపిణీ కార్యక్రమం, వృద్ధులకు ఉలెన్‌ బ్లాంకెట్స్‌ పంపిణీ చేయుటం. ఇక 19వ తేదీన అనాధ బాలబాలికలకు బట్టలు పంపిణీ కార్యక్రమం.. 20వ తేదీన.. అపోలో ఆసుపత్రిలో ఆధ్వర్యంలో ఉచిత నేత్ర పరీక్షలు, కళ్లజోళ్ల పంపిణీ. 
 
ఉచిత డెంటల్‌ క్యాంప్‌ నిర్వహించడం, 21న అన్నిచోట్ల స్వచ్ఛభారత్‌ కార్యక్రమం, 22వ తేదీన.. హైదరాబాద్‌ ఫిలింనగర్‌ ఆంజనేయస్వామి గుడిలో 1,116 మందితో చిరంజీవితో చిరంజీవి మాల, ఆంజనేయస్వామి దీక్షా కార్యక్రమం, లక్ష తమలపాకులతో పూజాకార్యక్రమం. ఫైనల్‌గా 22వ తేదీన 2.15గంటలకు మధ్యాహ్నం నుంచి రాత్రి 9.15 గంటలకు హైదరాబాద్‌లో చిరంజీవి 60వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించబడతాయి.