శుక్రవారం, 29 మార్చి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Raju
Last Modified: హైదరాబాద్ , గురువారం, 12 జనవరి 2017 (06:52 IST)

టికెట్ దొరకలేదు. గొంతు కోసుకున్నాడు. తిక్క ముదిరినట్టేనా?

ఒకరిది 150వ సినిమా తీస్తున్న సంబరం. మరి కొందరిది పదేళ్ల తర్వాత వస్తున్న తమ అబిమాన హీరో సినిమాని బ్లాక్ బస్టర్ చేయాలన్న సంబరం. ఇంకేముంది వచ్చి థియేటర్ల ముందు వాలిపోయారు. బుధవారం ఏపీ తెలంగాణల్లో ఏ థియేటర్లలో చూసినా చిరంజీవి సినిమాకు నీరాజనాలే. తొలి ఆట,

ఒకరిది 150వ సినిమా తీస్తున్న సంబరం. మరి కొందరిది పదేళ్ల తర్వాత వస్తున్న తమ అబిమాన హీరో సినిమాని బ్లాక్ బస్టర్ చేయాలన్న సంబరం. ఇంకేముంది వచ్చి థియేటర్ల ముందు వాలిపోయారు. బుధవారం ఏపీ తెలంగాణల్లో ఏ థియేటర్లలో చూసినా చిరంజీవి సినిమాకు నీరాజనాలే. తొలి ఆట, తొలి సీటు, తొలి టికెట్.. ఏం చేసయినా సరే సినిమా టికెట్ చింపాల్సిందే. ఖైదీ నం. 150 సినిమా చూసేయాల్సిందే. నరాలు తెగే ఉత్కంఠ. థియేటర్లో బొమ్మ పడేంతవరకు రణగొణ ధ్వనులే. జనం కదలికలే.. 
 
పాపం. కాలమే స్తంభించిపోయినట్లున్న ఆ క్షణంలో విశాఖపట్నంలో ఒక థియేటర్లోకి ఒక అభిమాని జొరబడ్డాడు. అప్పటికో పుల్లుగా మందు కొట్టాడు. ఊగిపోతున్నాడు. తన బాస్ ఈజ్ బ్యాక్.  టికెట్ కొట్టాలి. బొమ్మ చూసెయ్యాలి. కాని టికెట్ ఏదీ,. ఎక్కడు. అప్పటికే టికెట్లు అయిపోయాయి. థియేటర్లోకి జనం దూరుతున్నారు. బయట టికెట్ దొరకని మన అభిమాని. తొలి రోజు, తొలి షోలోనే చిరు సినిమా చూసేయాలన్న ఆశ ఆవిరయిపోయంది. అంతే తీవ్ర నిరాశకు గురైన ఆ అభిమాని ఉన్న ఫళాన బ్లేడుతో గొంతు కోసుకున్నాడు. తాగిన మైకంలోనా, లేక నిజంగానే భాధతోనా.. తెలీదు. కట్ టేస్తే అతడి మెడనుంచి రక్తం.. రక్తం... కారుతున్న రక్తం. జనాలకు ఏం జరిగిందో అర్థం కాలేదు. 
 
తర్వాత విచారిస్తే .. అసలు విషయం తెలిసింది. విశాఖపట్నం రమాటాకీస్‌లో బుదవారం తొలి షోకు టికెట్ దొరకలేదని మనస్తాపంతో గొంతుకోసున్న అబిమాని. సోషల్ మీడియాలో వైరల్. థియేటర్ యాజమాన్యం అతగాడిని ఆసుపత్రికి తీసుకెల్లాలని చూస్తే అతడు ససేమిరా అన్నాడు. తర్వాత పోలీసులు వచ్చి అతడిని అదుపు చేశారు. అప్పటికీ అతడు తగ్గితే కదా. చిరు సినిమా చూడటానికి టికెట్ ఇస్తేనే ఆసుపత్రికి వెళ్లి చికిత్స చేయించుకుంటాను అంటాడు.  మొత్తంమీద అతడికి టికెట్ రాలేదు. కానీ పోలీసులు ఎలాగోలా ఆసుపత్రికి తీసుకెళ్లారు. 
 
ఈ ఉన్మాదానికి ఎవరు కారకులు? ఈ రోజు కాకుంటే రేపు, రేపు కాకుంటే తర్వాతి రోజు సినిమా ఎక్కడికీ పోదు కదా. కానీ టిక్కెట్ దొరక్కపోతే గొంతు కోసుకునే  వరకు వెళ్లిన ఆ మనస్తత్వానికి ప్రాణంకంటే మించింది కాదు సినిమా అని బోధపడితే కదా. అభిమానులపై చిరు సినిమా ఎఫెక్ట్ అని ఊరుకుందామా..