Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

నాగార్జున కెరీర్‌లో 'ఓం న‌మో వేంక‌టేశాయ' క‌లికితురాయి : మెగాస్టార్ చిరంజీవి

శుక్రవారం, 10 ఫిబ్రవరి 2017 (13:43 IST)

Widgets Magazine
Chiranjeevi

అక్కినేని నాగార్జున - దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో కృపా ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రై.లిమిటెడ్‌ పతాకంపై ‘శిరిడిసాయి’ నిర్మాత ఏ. మహేష్‌ రెడ్డి నిర్మించిన భక్తిరస కథా చిత్రం ‘ఓం నమో వేంకటేశాయ’. స్వరవాణి కీరవాణి సంగీత దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఆడియో సంగీత ప్రియుల‌ను విశేషంగా అల‌రిస్తోంది. కొన్ని వందల‌ సంవత్సరాల క్రితం వేంకటేశ్వర స్వామి. ఈ చిత్రం శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. 
 
ఈ చిత్రాన్ని పలువురు సినీ ప్రముఖులు తొలి ఆటనే తిలకించారు. వీరిలో మెగాస్టార్ చిరంజీవి కూడా ఉన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... "ఓం న‌మో వేంక‌టేశాయ" సినిమా చూడ‌ట‌మే వండ‌ర్‌ఫుల్ ఎక్స్‌పీరియెన్స్‌. భ‌క్తి పార‌వ‌శ్యాలు పెల్లుబుకుతాయి. సెకండాఫ్ హృద్యంగా ఉండ‌ట‌మే కాదు, సెకండాఫ్ అంతా క‌ళ్ళు చెమ‌ర్చాయి. ప్రతి స‌న్నివేశం అద్భుతంగా ఉంది. సినిమా చూడ‌టం భ‌క్తితో కూడిన ప్ర‌యాణం చేసిన‌ట్టు అనిపించింది. 
 
ఇలాంటి సినిమా తీయాలంటే రాఘ‌వేంద్ర‌రావు, చెయ్యాలంటే నా మిత్రుడు నాగార్జున‌, తెర‌కెక్కించాలంటే నిర్మాత మ‌హేష్‌ రెడ్డికే చెల్లుతుంది. గ‌తంలో అన్న‌మ‌య్య‌, శ్రీరామ‌దాసు, శిర్డీసాయి చిత్రాల‌కు ధీటుగా ఉండే చిత్రం. నాగార్జున కెరీర్‌లో క‌లికితురాయిలాంటి చిత్రం ఓం న‌మో వేంక‌టేశాయ. రాఘ‌వేంద్ర‌రావు అద్భుతంగా తీస్తే.. న‌టీన‌టులు, టెక్నిషియ‌న్స్ ఇంకా గొప్ప‌గా చేశారు. సినిమా చూస్తే దివ్యానుభూతికి లోన‌వుతారు" అన్నారు.
<a class=om namo venkatesaya movie still" class="imgCont" height="453" src="http://media.webdunia.com/_media/te/img/article/2017-01/09/full/1483921332-3859.jpg" style="border: 1px solid #DDD; margin-right: 0px; float: none; z-index: 0;" title="" width="600" />
 
అలాగే, ప్రముఖ నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ... ఓం న‌మో వేంక‌టేశాయ ఒక అద్భుతం. సినిమా చివ‌రి అర్థగంట క‌న్నీళ్ళు ఆగ‌లేదు. అన్న‌మ‌య్య త‌ర్వాత అలాంటి గొప్ప వెంక‌టేశ్వ‌ర‌స్వామి సినిమాను అందించిన నాగార్జున‌కి, రాఘ‌వేంద్ర‌రావుకి, మ‌హేష్ అన్న‌కు థాంక్స్‌ అని అన్నారు. 
 
వంశీ పైడిప‌ల్లి మాట్లాడుతూ... 'మాట‌ల్లేవ్‌.. అన్న‌మ‌య్య త‌ర్వాత రాఘ‌వేంద్ర‌రావు, నాగార్జు అద్భుతాన్ని క్రియేట్ చేసిన సినిమా అవుతుంది. ప్ర‌తి ఒక్క‌రూ త‌ప్ప‌కుండా చూడాల్సిన సినిమా' అన్నారు. 
 
పీవీపీ మాట్లాడుతూ... ఓం న‌మో వెంక‌టేశాయ ఒక గొప్ప దృశ్య కావ్యం. ఇలాంటి సినిమా చూసే అవ‌కాశం జ‌న్మ‌కు ఒక‌సారి మాత్ర‌మే వ‌స్తుంది. అద్భుతంగా ఉంది. నాగార్జున‌, రాఘవేంద్ర‌రావు, మ‌హేష్‌ స‌హా టీంకు ఆల్ ది బెస్ట్ అని వ్యాఖ్యానించారు. 
 
హీరో సుశాంత్ మాట్లాడుతూ... సినిమా చూడ‌గానే ఎమోష‌నల్‌గా అనిపించింది. నాకు తెలియ‌ని విష‌యాలు చాలా నేర్చుకున్నాను. అంద‌రినీ క‌ద‌లించే చిత్ర‌మ‌వుతుంది. అంద‌రూ త‌ప్ప‌కుండా చూడండి అన్నారు. 
 
పి.వి.సింధు మాట్లాడుతూ.. సినిమా చాలా గొప్ప‌గా ఉంది. నాగార్జున‌, రాఘవేంద్ర‌రావు స‌హా అంద‌రికీ ఆల్ ది బెస్ట్‌. ప్ర‌తి ఒక క్యారెక్ట‌ర్ చాలా బాగా చేశారు. సినిమా త‌ప్ప‌కుండా సూప‌ర్‌హిట్ అవుతుందన్నారు.
 
నిర్మాత ఎ.మ‌హేష్ రెడ్డి మాట్లాడుతూ... ఈ సినిమా గోవిందుడి ప్ర‌యాణం. నాగార్జున‌ హ‌థీరాంబావాజీగా ఒదిగిపోయి గోవిందుడిని మై మ‌ర‌పించారు. తిరుమ‌ల‌లో త‌ప్పు చేయ‌కూడ‌ద‌ని, అస‌లు వెంక‌టేశ్వ‌ర‌స్వామికి బాలాజీ అనే పేరు ఎందుకు వ‌చ్చింద‌ని ఇలా ఎన్నో ర‌కాల మెసేజ్‌ల‌ను ఇచ్చారు. రాఘ‌వేంద్ర‌రావుగారు చేసిన అద్భుతం, నాగార్జున‌ యాక్టింగ్, కీర‌వాణి సంగీతం, గోపాల్‌రెడ్డి కెమెరా వ‌ర్క్‌, భార‌వి క‌థ ఇలా అన్ని ఉన్న సినిమా చూడ‌గానే నా జ‌న్మ ధ‌న్య‌మైపోయింద‌నుకున్నాను అన్నారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

ఓం నమో వేంకటేశాయ రివ్యూ రిపోర్ట్.. అలరించిన నాగ్-నిరాశపరిచిన సౌరభ్.. అందంగా కనిపించాడు.. కానీ?

నటీనటుల యాక్టింగ్ అదిరింది. నాగార్జున అన్నమయ్య, రామదాసుగా అలరించినట్లే హాథీరాం బాబాజీ ...

news

కళ్యాణ్ రామ్ నిర్మాణంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ 27వ చిత్రం ప్రారంభం

'జనతా గ్యారేజ్' చిత్రంతో పలు రికార్డులు తిరగరాసిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ తదుపరి చిత్రం, ...

news

''రంగూన్''లో సహజ సౌందర్యాన్ని ఒలకపోశాను.. ఓపెన్ రైలు బోగిపై డ్యాన్స్ చేశా: కంగనా రనౌత్

బోల్డ్‌గా మాట్లాడటంలో దిట్ట, అందాల సుందరి కంగనా రనౌత్ ప్రస్తుతం బాలీవుడ్‌లో రంగూన్ ...

news

యాక్టింగ్ కూడా ఉద్యోగమే.. భర్తకు-అత్తకు నచ్చలేదంటే ఎలా? పెళ్లై పిల్లలు పుట్టినా నటిస్తా: శ్రుతిహాసన్

పెళ్లైన తర్వాత సినిమాలకు దూరం కాలేదని.. దర్శకుడు విజయ్ అమలాపాల్‌తో విడాకులు తీసుకున్న ...

Widgets Magazine