గురువారం, 28 మార్చి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : ఆదివారం, 2 అక్టోబరు 2016 (13:38 IST)

''మీలో ఎవరు కోటీశ్వరుడు'' చిరంజీవి డైలాగ్స్ అదుర్స్.. వీడియో చూడండి..

''మీలో ఎవరు కోటీశ్వరుడు'' నాలుగో సీజన్‌కు చిరంజీవి హోస్ట్‌గా వ్యవహరించనున్న సంగతి తెలిసిందే. ఈ షోకు సంబందించిన ప్రోమోను 'మెగా సర్ ప్రైజ్' పేరుతో మాటీవీ ఛానెల్ ఇటీవల విడుదల చేస్తే మంచి ఆదరణ లభించింది.

''మీలో ఎవరు కోటీశ్వరుడు'' నాలుగో సీజన్‌కు చిరంజీవి హోస్ట్‌గా వ్యవహరించనున్న సంగతి తెలిసిందే. ఈ షోకు సంబందించిన ప్రోమోను 'మెగా సర్ ప్రైజ్' పేరుతో మాటీవీ ఛానెల్ ఇటీవల విడుదల చేస్తే మంచి ఆదరణ లభించింది.

ఈ టీజర్లో చిరంజీవి అదుర్స్ అనిపించాడు.
వెండితెరపై తనను గెలిపించారు. బుల్లితెరపై మిమ్మల్న గెలిపించేందుకు వస్తున్నానని.. కమాన్.. లెటజ్ ప్లే అంటూ చిరంజీవి చెప్పే డైలాగుకు విజిల్స్ వచ్చేస్తాయి. 
 
''కోట్ల మంది హృదయాలను కొల్లగొట్టినవాడు మీతో కోటి గెలిపించేందుకు వస్తున్నాడు..'' అంటూ సాగే ఈ ప్రోమోలో చిరంజీవి ఎంట్రీ ఇస్తున్న దృశ్యాలను షూట్ చేయడం జరిగింది. ప్రస్తుతం ఈ ప్రోమోటో మెగా అభిమానాలు సోషల్ మీడియాలో పండగ చేసుకుంటున్నారు. ఇకపోతే ఈ షో డిసెంబర్ 2 నుండి మాటీవీలో ప్రసారం కానుంది.