Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

దుమ్ము రేపుతున్న బాస్ 'ఖైదీ నెం 150'... 'బాహుబలి'ని పడగొడతాడా...?

బుధవారం, 11 జనవరి 2017 (14:11 IST)

Widgets Magazine

మెగాస్టార్ చిరంజీవి స్టామినా ఏమిటో 10 ఏళ్ల విరామం తర్వాత కూడా మరోసారి రుజువవుతోంది. రికార్డులను క్రియేట్ చేయడమే కాదు తిరగరాయడం కూడా బాస్ చేసేందుకు ముందుకు దూసుకువెళుతున్నాడు. ఓవర్సీస్ లో ఖైదీ నెం. 150 చిత్రం దుమ్ములేపుతోంది. తాజాగా అందిన సమాచారం ప్రకారం 1 మిలియన్ డాలర్ల క్లబ్బులోకి చిత్రం దూసుకవెళ్లింది. బాహుబలి తర్వాత ఈ ఫీట్ ను ఏ తెలుగు చిత్రం అందుకోలేకపోయింది. 
Chiranjeevi
 
బాహుబలి ఓవర్సీస్‌లో మొదటి రోజు 1.36 మిలియన్ డాలర్ల వసూళ్లతో రికార్డు క్రియేట్ చేయగా చిరంజీవి ఖైదీ నెం. 150 1.15 మిలియన్ డాలర్లు రాబట్టి బాహుబలి సరసన నిలబడింది. మొత్తం వసూళ్ల పరంగా బాహుబలి రికార్డును అధిగమించే అవకాశం ఉన్నదని అంటున్నారు. కాగా మొదటి రోజు వసూళ్లు ప్రపంచవ్యాప్తంగా సుమారుగా రూ. 40 కోట్లు వుండవచ్చని అనుకుంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. రామ్ చరణ్ తొలిసారిగా కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పైన నిర్మించిన ఈ చిత్రం మంచి కలెక్షన్ రిపోర్టుతో ముందుకు వెళుతోంది. ఈ చిత్రంలో చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ నటించింది.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

'గౌతమిపుత్ర శాతకర్ణి' దర్శకుడు క్రిష్‌కు 'బాహుబలి' ఫీవర్.. ఖైదీతో లెక్కలేదట..

'గౌతమిపుత్ర శాతకర్ణి' చిత్ర దర్శకుడు క్రిష్‌కు 'బాహుబలి' ఫీవర్ పట్టుకుందట. అదేసమయంలో ...

news

''ఖైదీ నెం.150'' మైనస్ పాయింట్స్.. డాన్సులు చేయడంలో చిరంజీవి ఇబ్బందిపడ్డారా? సెంటిమెంట్ డౌన్?

ఖైదీలో ఉన్న మైనస్‌ల గురించి ప్రస్తుతం టాలీవుడ్‌లో చర్చ సాగుతోంది. ఖైదీ 150 సినిమాను ...

news

హే రోజా..! ఊరుకో వాడిని గారు అంటావేంటి? పిల్లాడిగా ఉన్నప్పుడు ఎత్తుకున్నావ్..

ప్రముఖ సినీ నటుడు, మాజీ కేంద్రమంత్రి చిరంజీవికి ప్రముఖ సినీ నటి, వైసిపి ఎమ్మెల్యే రోజా ...

news

''ఖైదీ నెంబర్ 150'' సంక్రాంతికి రాలేదు.. ఆ పెద్ద పండగే అన్నయ్య వద్దకు వచ్చింది.. జబర్దస్త్ టీమ్

మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా ''ఖైదీ నెంబర్ 150'' ప్రపంచ వ్యాప్తంగా జనవరి 11న రిలీజ్ ...

Widgets Magazine