మెగాస్టార్ చిరంజీవి కొత్త లుక్.. మీసాల్లేని సైరా నరసింహారెడ్డి

శనివారం, 13 జనవరి 2018 (16:45 IST)

మెగాస్టార్ చిరంజీవి కొత్త లుక్‌లో కనిపించారు. ఖైదీ 150లో స్టైలిష్‌గా కనిపించి.. యువ హీరోలకే చుక్కలు చూపించిన చిరంజీవి, తన 151వ చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’ షూటింగ్‌ పనుల్లో ప్రస్తుతం బిజీగా ఉన్నారు. అభిమానులకు, ప్రేక్షకులకు, తెలుగు ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన చిరంజీవి.. మీసం లేని గెటప్‌లో మీడియా ముందుకు వచ్చారు. 
 
ఇన్నాళ్లు గడ్డం, మీసాలతో కనిపించిన చిరంజీవి.. క్లీన్ షేవ్‌తో నూతన తారాగణంతో రూపొందుతున్న ‘జువ్వ’ సినిమా టీజర్ రిలీజ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. కొత్త సంవత్సరాది వేడుకల్లో గడ్డంతో కనిపించిన చిరును మీసాలు లేకుండా కనిపించారు. ఆయన్ని చూసేందుకు ఫ్యాన్స్ ఎగబడ్డారు.

''జువ్వ'' టీజర్ రిలీజ్ చేసిన చిరంజీవి మాట్లాడుతూ, ఈ సినిమా అందరినీ అలరిస్తుందని తనకు నమ్మకం ఉందని, అన్ని వర్గాల వారిని ఆకట్టుకునేలా ఈ సినిమా తీశారని ప్రశంసించారు. 
 
మెగాస్టార్ చిరంజీవి 151వ చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్రను చిరంజీవి పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా గురించి చిరంజీవి మాట్లాడుతూ.. పొల్లాచ్చిలో సెకండ్ షెడ్యూల్ ఫిబ్రవరిలో ప్రారంభం కానుందని ప్రకటించారు.
Chiranjeeviదీనిపై మరింత చదవండి :  
Megastar Chiranjeevi Teaser Trikoti Ranjith Juvva Movie Palak Lalwani Saira Narasimha Reddy

Loading comments ...

తెలుగు సినిమా

news

''గాయత్రి'' టీజర్: అర్థం చేసుకుంటారో అపార్థం చేసుకుంటారో ఛాయ్స్ ఈజ్ యువర్స్

''పెళ్లైన కొత్తలో" ఫేమ్ మదన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ''గాయత్రి'' చిత్రంలో మోహ‌న్ బాబు ...

news

''సాహో'' టీమ్‌తో స్వీటీ

మిర్చి, బాహుబలి సినిమాలలో కలిసి పని చేసిన ప్రభాస్, అనుష్కలు ఎంతో మంచి స్నేహితులన్న సంగతి ...

news

నాగార్జున-నాని మల్టీస్టారర్‌లో రకుల్ ప్రీత్ సింగ్..

నాగార్జున- అనుష్క కెమిస్ట్రీ అంటేనే ఫ్యాన్స్ మధ్య మంచి ఫాలోయింగ్ వుంది. అందుకే ఈ జంట ...

news

సంక్రాంతి స్పెషల్ సాంగ్ ఓ లుక్కేయండి (Video)

బతుకమ్మ పండుగకు తెలంగాణలో పుట్టి.. పూలపల్లకి ఎక్కి అంటూ సాగిన పాట పాపులర్ అయ్యింది. ...