బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By DV
Last Modified: మంగళవారం, 6 డిశెంబరు 2016 (18:19 IST)

త‌మిళ‌నాడు ప్ర‌జ‌ల‌కు జ‌య‌ల‌లిత చేసిన కృషి అనన్యసామాన్యం: మెగాస్టార్ చిరంజీవి

త‌మిళ‌నాడు రాష్ట్ర ముఖ్య‌మంత్రి జ‌య‌ల‌లిత గారి మృతి ఒక్క త‌మిళ‌నాడుకే కాక యావ‌త్ దేశానికి తీర‌ని లోటు. ద‌క్షిణాది భాషా చిత్రాల్లో న‌టించి గొప్ప న‌టిగా పేరు తెచ్చుకున్నారు. ఒక సినీ హీరోయిన్ అమ్మ‌గా ప్ర‌జ‌లంద‌రి అభిమానాన్ని చూర‌గొన‌డం ఒక్క జ‌య‌ల‌లిత గా

త‌మిళ‌నాడు రాష్ట్ర ముఖ్య‌మంత్రి జ‌య‌ల‌లిత గారి మృతి ఒక్క త‌మిళ‌నాడుకే కాక యావ‌త్ దేశానికి తీర‌ని లోటు. ద‌క్షిణాది భాషా చిత్రాల్లో న‌టించి గొప్ప న‌టిగా పేరు తెచ్చుకున్నారు. ఒక సినీ హీరోయిన్ అమ్మ‌గా ప్ర‌జ‌లంద‌రి అభిమానాన్ని చూర‌గొన‌డం ఒక్క జ‌య‌ల‌లిత గారికే సాధ్య‌ప‌డింది. రాజ‌కీయంగా అనేక ఆటుపోట్ల‌కు ఎదురు నిలిచిన ధీర వ‌నిత‌గా మ‌హిళ‌లంద‌రికీ ఆద‌ర్శ‌ప్రాయంగా నిలిచారు. 
 
త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రిగా ఆమె ప్ర‌వేశ‌పెట్టిన వినూత్న సంక్షేమ ప‌థ‌కాలు పేద‌, మ‌ధ్య‌త‌ర‌గ‌తి ప్ర‌జ‌ల జీవితాల్లో మెరుగైన మార్పుల‌కు దోహ‌దం చేశాయి. ముఖ్యంగా త‌మిళ‌నాడులో సామాజిక న్యాయం చేయ‌డానికి గాను రిజ‌ర్వేష‌న్ల కోటాను 69 శాతానికి పెంచ‌డానికి అమిత చొర‌వ తీసుకున్నారు. త‌మిళ‌నాడు చ‌ట్టం రూపొందించి దాన్ని పార్ల‌మెంట్ ద్వారా తొమ్మిద‌వ షెడ్యూల్లో చేర్చ‌డానికి జ‌య‌ల‌లిత‌గారు చేసిన కృషి అన‌న్యసామాన్యం. జ‌య‌ల‌లిత గారి ఆత్మ‌కు శాంతి క‌ల‌గాల‌ని మ‌నస్ఫూర్తిగా కోరుకుంటున్నా - చిరంజీవి