శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : బుధవారం, 8 ఫిబ్రవరి 2017 (21:44 IST)

"ఖైదీ నంబర్.150" చిత్రానికి చిరంజీవి రెమ్యునరేషన్ రూ.33 కోట్లు?

మెగాస్టార్ చిరంజీవి కమ్ బ్యాక్ మూవీ "ఖైదీ నంబర్ 150". ఈ చిత్రం సంక్రాంతికి విడుదలై బాక్సాఫీస్ రికార్డులను షేక్ చేసింది. వివి.వినాయక్ దర్శకత్వంలో చిరంజీవి తనయుడు రామ్ చరణ్ తేజ్ నిర్మించిన ఈ చిత్రంలో కా

మెగాస్టార్ చిరంజీవి కమ్ బ్యాక్ మూవీ "ఖైదీ నంబర్ 150". ఈ చిత్రం సంక్రాంతికి విడుదలై బాక్సాఫీస్ రికార్డులను షేక్ చేసింది. వివి.వినాయక్ దర్శకత్వంలో చిరంజీవి తనయుడు రామ్ చరణ్ తేజ్ నిర్మించిన ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ హీరోయిన్. ఈ చిత్రం కలెక్షన్లపరంగా సరికొత్త రికార్డులు నెలకొల్పింది.
 
అయితే, ఈ చిత్రానికి చిరంజీవి తీసుకున్న పారితోషికంపై ఫిల్మ్ నగర్‌లో ఆసక్తికర చర్చ సాగుతోంది. అదేంటి చిరు తనయుడు రామ్ చరణే కదా సినిమాను నిర్మించింది పారితోషికం కూడా తీసుకున్నాడా? అన్న అనుమానం రావొచ్చు. కానీ చిరంజీవి నిలబెట్టి తన పారితోషికాన్ని వసూలు చేసినట్టు సమాచారం.
 
ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం మేరకు చిరంజీవి పారితోషికంగా రూ.33 కోట్లు తీసుకున్నట్టు సమాచారం. ఈ మొత్తాన్ని ఈ చిత్ర నిర్మాతకు వచ్చిన లాభాల్లో పర్సంటేజ్ తీసుకున్నాడని ఫిల్మ్‌ నగర్ వర్గాల సమాచారం. సినిమాకు వచ్చిన లాభాల్లో చిరు 60 శాతం షేర్ తీసుకున్నాడని టాక్ వినిపిస్తోంది. సినిమాను రూ.55 కోట్ల బడ్జెట్‌తో నిర్మించినట్టు గతంలోనే వార్తలు వచ్చాయి.
 
అంతేకాదు సినిమా ప్రి రిలీజ్ బిజినెస్ ద్వారానే సుమారు రూ.110 కోట్లను రాబట్టినట్టు సమాచారం. ఆ తర్వాత సినిమాపై పెరిగిన భారీ క్రేజ్‌తో సినిమాకు బాగానే లాభాలు వచ్చాయట. దీంతో వచ్చిన లాభాల్లో చిరు రూ.33 కోట్లు తీసుకోగా, చరణ్‌కు రూ.22 కోట్లు మిగిలాయట. అంతేకాదు ప్రస్తుతం హీరోల్లో ఎవరు అత్యధిక పారితోషికం తీసుకుంటున్నారంటే.. చిరంజీవేనని ఫిల్మ్‌ నగర్ వర్గాలు చర్చించుకుంటున్నాయట.