శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By DV
Last Updated : సోమవారం, 22 ఆగస్టు 2016 (10:25 IST)

చిరంజీవి షార్ట్ ఫిలిమ్ ప్రీమియర్ షో: క్లాప్ బోర్డ్ ప్రొడక్షన్స్‌పై రిలీజ్

"పరిచయం, థ్యాంక్యూ మిత్రమా, జోక్, నాతిచరామి" లాంటి కంటెంట్ బేస్డ్ షార్ట్ ఫిలిమ్స్‌తో పాటు "అయామ్ కార్తీక్, పిట్ట కథ" లాంటి మెసేజ్ ఓరియంటెడ్ షార్ట్ ఫిలిమ్స్ మరియు "ఓ క్షణం, 'సఖియా తెలుసా నీకైనా' వంటి హ

"పరిచయం, థ్యాంక్యూ మిత్రమా, జోక్, నాతిచరామి" లాంటి కంటెంట్ బేస్డ్ షార్ట్ ఫిలిమ్స్‌తో పాటు "అయామ్ కార్తీక్, పిట్ట కథ" లాంటి మెసేజ్ ఓరియంటెడ్ షార్ట్ ఫిలిమ్స్ మరియు "ఓ క్షణం, 'సఖియా తెలుసా నీకైనా' వంటి హిలేరియస్ అండ్ లవ్లీ షార్ట్ ఫిలిమ్స్‌ను రూపొందించి "షార్ట్ ఫిలిమ్ ఇండస్ట్రీలో" తమకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకొన్న "క్లాప్ బోర్డ్" ప్రొడక్షన్స్ సంస్థ రూపొందించిన తాజా లఘు చిత్రం "చిరంజీవి". 
 
ఆర్.కె.నల్లం (రామకృష్ణ నల్లం, యు.ఎస్) నిర్మించిన ఈ షార్ట్ ఫిలిమ్‌లో యాంకర్‌గా సూపర్ ఫామ్‌లో ఉన్న రవి టైటిల్ పాత్ర పోషించగా.. ఈ లఘు చిత్రం ద్వారా యువ ప్రతిభాశాలి నందకిషోర్ దర్శకుడిగా పరిచయమయ్యాడు. సిరివెన్నెల సీతామరామశాస్త్రి గారి తనయుడు యోగేశ్వర శర్మ ఈ లఘు చిత్రానికి సంగీతాన్ని సమకూర్చారు. శనివారం (ఆగస్ట్ 20) హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్స్‌లో ఘనంగా నిర్వహింపబడిన ఈ కార్యక్రమంలో ప్రముఖ నటులు/రచయిత/దర్శకులు తనికెళ్ళ భరణి, ప్రముఖ దర్శకులు మోహనకృష్ణ ఇంద్రగంటి, పాపులర్ యాంకర్స్ కమ్ యాక్టర్స్ రష్మీ, శ్రీముఖి, నటుడు కృష్ణ చైతన్య, "వీకెండ్ లవ్" దర్శకులు నాగు గవర, "పెళ్ళిచూపులు"తో ఘన విజయం సొంతం చేసుకొన్న నిర్మాత రాజ్ కందుకూరి, "పెళ్ళిచూపులు" ఫేమ్ ప్రియదర్శి, "క్లాప్ బోర్డ్ ప్రొడక్షన్స్" సంస్థకు "థ్యాంక్యూ మిత్రమా" లాంటి అద్భుతమైన షార్ట్ అండ్ క్యూట్ ఫిలిమ్‌ను అందించి.. సంస్థకు మంచి గుర్తింపు రావడానికి ముఖ్య కారకుడైన రాకేష్ సిల్వర్ మరియు "చిరంజీవి" యూనిట్ సభ్యులు పాల్గొన్నారు. 
 
ఓ మనిషికి లభించిన వరం, అతడికి శాపంగా ఎలా మారింది? అనే డిఫరెంట్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన లఘు చిత్రం "చిరంజీవి". యాంకర్ రవి, పూజా, వీరభద్రమ్, జబర్దస్త్ మురళి, తదితరులు ముఖ్యపాత్రలు పోషించిన ఈ లఘు చిత్రంలో తనికెళ్ళ భరణి గారి స్వరం ఓ కీలక భూమిక పోషించడం విశేషం. 
 
వేడుకలో పాల్గొన్న అతిధులందరూ.. విభిన్నమైన కాన్సెప్ట్‌తో తెరకెక్కిన "చిరంజీవి" లఘు చిత్రంపై ప్రశంసల వర్షం కురిపించడంతోపాటు ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమైన ప్రతిభాశాలి నందకిషోర్.. త్వరలోనే ఫీచర్ ఫిలిమ్‌కు దర్శకత్వం వహించాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదించారు. అలాగే.. నటుడిగా రవి ఈ లఘు చిత్రంలో చాలా పరిణితి ప్రదర్శించాడని, ఇకనుంచైనా అతడు సినిమాలపై దృష్టి సారించాలని అభిలషించారు. 
 
"చిరంజీవి" యూనిట్ సభ్యులందరూ.. తమ చిన్న చిత్రానికి (షార్ట్ ఫిలిమ్) ఇంతటి గ్రాండ్ ప్రీమియర్ ను ఏర్పాటు చేయడంతో.. తమకు అనుక్షణం అండగా నిలుస్తున్న "క్లాప్ బోర్డ్ ప్రొడక్షన్స్" అధినేత ఆర్.కె.నల్లంకు తమ కృతజ్ణతలు తెలుపుకొన్నారు.