Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

'మనం సైతం'కు మెగాస్టార్ చిరంజీవి ప్రశంసా పత్రం

శనివారం, 14 ఏప్రియల్ 2018 (18:10 IST)

Widgets Magazine

సేవా సామ్రాజ్యంగా విస్తరిస్తున్న "మనం సైతం" సంస్థకు అండగా ఉంటానన్నారు మెగాస్టార్ చిరంజీవి. గతంలో సంస్థ సేవా కార్యక్రమాల గురించి తెలిసి.... 'మనం సైతం' నిర్వాహకులు కాదంబరి కిరణ్‌ను ఇంటికి ఆహ్వానించి 2 లక్షల రూపాయల విరాళాన్ని అందజేసిన చిరంజీవి... తాజాగా తన స్వదస్తూరితో ప్రశంసా పత్రాన్ని అందజేశారు. తమ్ముడు కాదంబరి మంచి కార్యక్రమం చేస్తున్నాడంటూ ఆ లేఖలో చిరు పేర్కొన్నారు.
memu saitham team
 
'మనం సైతం' కార్యక్రమాలను మెగాస్టార్ కు వివరించేందుకు సభ్యులు కాదంబరి కిరణ్, బందరు బాబీ ఆయన ఇంటికి వెళ్లారు. ఇటీవల తాము చేసిన సేవా కార్యక్రమాల గురించి కాదంబరి కిరణ్ చిరంజీవికి వివరించారు. ఈ సందర్భంగా కాదంబరి బృందాన్ని మెచ్చుకున్న చిరు... మనం సైతంకు ఎప్పుడు, ఏ సాయం కావాలన్నా చేస్తానన్నారు. 
 
తమ్ముడు కాదంబరి కిరణ్ వయసులో చిన్నవాడైనా, మనసులో ఎంతో పెద్దవాడు. ఆపదలో ఉన్నవారిని, అవసరార్థులను అక్కున చేర్చుకుని, నేనుసైతం అంటూ వారికి చేయూత అందివ్వడం, వారికి భరోసాగా ఉండటం, వారికి ఆశాజ్యోతిలా ఉండటం ఎంతో అభినందనీయం. అతను చేస్తున్న ఈ కార్యక్రమానికి అతనితో పాటు మేము సైతం అంటూ మేమంతా ఉంటాం. 
 
ఈ సేవా కార్యక్రమంలో అతనికి చేదోడు వాదోడుగా ఉన్న ఆ సంస్థ కార్యవర్గ సభ్యులకు మనస్ఫూర్తిగా నా అభినందనలు. ఆ భగవంతుడు కాదంబరికి మంచి మనసు ఇవ్వడమే కాదు మంచి భవిష్యత్ ను కూడా ఇస్తాడని ప్రగాఢంగా నమ్ముతూ.. ఆశీస్సులతో అన్నయ్య చిరంజీవి... అంటూ ప్రశంసా లేఖలో మెగాస్టార్ చిరు తన వాత్సల్యం చూపించారు. 
 
అన్నయ్య ఆశీస్సులు దక్కడంపై కాదంబరి కిరణ్ స్పందిస్తూ.... మన సైతం ఒక యజ్ఞంలా సాగిపోతోంది. సాయం కోరిన ప్రతి పేదవారికీ ఆసరాగా ఉంటున్నాం. ఈ గొప్ప కార్యక్రమానికి అన్నయ్య చిరంజీవిలాంటి గొప్ప వ్యక్తి అండ దొరకడం సంతోషంగా ఉంది. ఆయన మరోసారి మా ద్వారా సంస్థ కార్యక్రమాల గురించి తెలుసుకున్నారు. మమ్మల్ని అభినందించారు. ఆయన మాటలతో నాతో పాటు మా బృందానికి ఎంతో ధైర్యం కలిగింది. మెగాస్టార్ ఇచ్చిన అండతో మరింత ఉత్సాహంగా మనం సైతంను పేదల పాలిట పెన్నిధి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మనం సైతం సభ్యులు బందరు బాబీ, ఆయన సతీమణి కవిత పాల్గొన్నారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

రామానాయుడు స్టూడియోలో అమ్మాయిలు నలిగిపోతున్నారు : శ్రీరెడ్డి

తెలుగు చిత్ర పరిశ్రమలో అమ్మాయిల క్యాస్టింగ్ కౌచ్‌పై పోరాటం చేస్తున్న నటి శ్రీరెడ్డి ...

news

'రెడ్డి' అనే పదం మోయడం బరువుగా వుంది.. ఇకపై నా పేరు శ్రీశక్తి : శ్రీరెడ్డి

హైదరాబాద్ నడిబొడ్డున అర్థనగ్న ప్రదర్శనలు నిర్వహించి సంచలనం రేపిన నటి శ్రీరెడ్డి మరోమారు ...

news

సావిత్రిని తీసిపెట్టిన కీర్తి సురేష్ : మే 9న 'మహానటి' మూవీ రిలీజ్

అలనాటి సీనియర్ నటి సావిత్రి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం 'మహానటి'. ఈ చిత్రం ...

news

'పెదవులు దాటని పదం పదంలో.. కనులలో దాగని నిరీక్షణంలో'.. అల్లు అర్జున్ (Lyrical Song)

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా అనూ ఇమ్మాన్యుయేల్ హీరోయిన్‌గా వక్కంతం వంశీ ...

Widgets Magazine