శుక్రవారం, 29 మార్చి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : గురువారం, 4 ఫిబ్రవరి 2016 (09:50 IST)

కత్తి షూటింగ్‌లోపు కోలుకోవాలి: చిరంజీవికి ఆపరేషన్.. రెండు నెలల పాటు రెస్ట్ కావాలట!

మెగాస్టార్ చిరంజీవికి గురువారం శస్త్రచికిత్స జరుగనుంది. ముంబైలోని బ్రీచ్ కాండీ ఆసుపత్రిలో చిరంజీవి చేరారు. చిరంజీవి తన భుజానికి ఏర్పడిన గాయానికి శస్త్రచికిత్స చేయించుకోనున్నారు. ఆపరేషన్ నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తైనట్లు సమాచారం. కాగా తన 150వ సినిమాగా తమిళంలో సూపర్ హిట్టయిన 'కత్తి' సినిమాను చిరంజీవి ఎంచుకున్న సంగతి తెలిసిందే. 
 
ఈ సినిమా షూటింగ్ ప్రారంభమయ్యే ముందే ఈ ఆపరేషన్ ముగించేసుకోవాలని భావించినట్టు తెలుస్తోంది. కాగా, చిరంజీవి వెంట ఆయన భార్య సురేఖ కూడా ఉన్నారు. ఆపరేషన్ ముగిసిన తరువాత దాదాపు రెండు నెలల పాటు విశ్రాంతి తీసుకోవాల్సి వుంటుందని వైద్యులు సూచిస్తున్నారు. ఆపరేషన్ తర్వాత హైదరాబాదు వచ్చే చిరంజీవి రెండు నెలల పాటు విశ్రాంతి తీసుకుని కత్తి షూటింగ్‌లో పాల్గొంటారని తెలిసింది.