Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

తిరుమలలో చిరంజీవి సతీమణి సురేఖ.. మీడియాతో గొడవ... ఎందుకు?

బుధవారం, 4 ఏప్రియల్ 2018 (15:56 IST)

Widgets Magazine

ఎప్పుడు సినిమా ఫంక్షన్లు జరిగినా తన భర్త చిరంజీవితో పాటు కలిసి వెళ్ళి సైలెంట్‌గా కూర్చుని తిరిగి వచ్చేస్తుంటారు ఆయన సతీమణి సురేఖ. ఎవరితోను పెద్దగా మాట్లాడరు. తన పనేదో తాను చేసుకుని వెళ్ళిపోతుంటారు. అలాంటి సురేఖకు కోపమొచ్చింది. అది కూడా ఎక్కడో కాదు. తిరుమలలోనే. తన కుమారుడి సినిమా రంగస్థలం విడుదలై భారీ విజయాన్ని కైవసం చేసుకోవడంతో శ్రీవారిని దర్శించుకున్నారు చిరు భార్య సురేఖ.
Surekha
 
సురేఖతో పాటు ఆమె స్నేహితులు, బంధువులు కూడా ఉన్నారు. ఆలయం వెలుపల వస్తున్న సురేఖను మీడియా ప్రతినిధులు చిత్రీకరిస్తుండగా ఏయ్.. పక్కకు వెళ్ళండి.. ఏంటిది? ఎందుకు తీస్తున్నారు. అలా తీయకూడదు. తీయొద్దండి.. చెబుతున్నాగా.. వెళ్ళండి వెళ్లండి... అంటూ గట్టిగా అరిచారు. మేడం ఇది మా డ్యూటీ.. ప్రముఖులు వచ్చినప్పుడు చిత్రీకరించి వారి అభిప్రాయాలను తెలుసుకుంటాము అని మీడియా ప్రతినిధులు చెప్పగా నాకు అదంతా అవసరం లేదు.
 
నన్ను తీయొద్దండి.. నన్ను టీవీల్లో చూపించొద్దండీ అంటూ గట్టిగా అరుస్తూ కారెక్కి వెళ్ళిపోయారు. సురేఖనే స్వయంగా చెప్పడంతో మీడియా ప్రతినిధులు కూడా సైలెంట్ అయిపోయారు. ఎప్పుడూ సైలెంట్‌గా ఉండే సురేఖ ఇంత కోపాన్ని ప్రదర్శించడంతో మీడియా ప్రతినిధులు షాక్ తిన్నారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  
Chiranjeevi Wife Surekha Angry Media Tirumala Darshan

Loading comments ...

తెలుగు సినిమా

news

నేనేంటో తిరుమల శ్రీవారికి బాగా తెలుసు.. 'చల్ మోహన్ రంగ' నితిన్ (Video)

ఎంత పెద్ద ప్రముఖుడైనా శ్రీవారికి భక్తుడే అన్నది అందరికీ తెలిసిందే. తిరుమల శ్రీవారు అంటే ...

news

సుక్కుతో డార్లింగ్ సినిమా.. అబుదాబికి ''సాహో'' ఎందుకు?

రంగస్థలం సినిమా బంపర్ హిట్ అయిన నేపథ్యంలో.. డార్లింగ్, బాహుబలి హీరో ప్రభాస్‌తో సినిమా ...

news

నాజూగ్గా తయారవుతున్న పదహారణాల తెలుగమ్మాయి (వీడియో)

'సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రంతో మంచి పేరు దక్కించుకున్న హీరోయిన్ అంజలి. ...

news

బాత్రూమ్ సీన్ షూటింగ్‌లో జారిపోయిన దుస్తులు... లీక్ చేసిన నిర్మాత

ఓ భోజ్‌పురి నటికి చేదు అనుభవం ఎదురైంది. బాత్రూమ్ సీన్ షూటింగ్ సమయంలో ధరించిన దుస్తులు ...

Widgets Magazine