Widgets Magazine

నేను ఎవరి కాలుమీద కాలేసి కూర్చోను: వేణు మాధవ్

శుక్రవారం, 24 నవంబరు 2017 (11:06 IST)

venu madhav

సినిమాలకు దూరమై.. తెలుగుదేశం పార్టీలో క్రియాశీలక రాజకీయాల్లోకి దిగిన హాస్య నటుడు వేణుమాధవ్.. తన సినిమా షూటింగ్ అనుభవాలను తాజా ఇంటర్వ్యూలో తెలిపాడు. తానొక సినిమా షూటింగుకి వెళ్లినప్పుడు ఓ పెద్ద హీరో తనను పిలిచారని.. ఏవయ్యా నువ్వు కాలు మీద కాలేస్తావట కదా అడిగారు. నేను ఎవరు చెప్పారని అడిగాను. నేను నిరూపిస్తానయ్యా అంటూ ఎవరికో ఫోన్ చేస్తున్నారు. 
 
ఇంతలో ఆయన్ని అడ్డుకుని విషయమేంటో స్పష్టంగా చెప్పండి సార్ అన్నాను. నువ్వు కాలుమీద కాలేసుకుని కూర్చుకుంటావట గదా.. అన్నారు. వెంటనే "నేను ఎవరి కాలుమీద కాలేసి కూర్చోను సార్ .. నా కాలుమీద నా కాలేసుకుని కూర్చుంటాను. 
 
అదెలా తప్పవుతుందని ఆయన్నే ప్రశ్నించాను. అలా అడగ్గానే రెండు నిమిషాల పాటు ఆయన సైలెంట్‌గా వుండిపోయారని వేణు మాధవ్ చెప్పుకొచ్చారు. నువ్వు మాట్లాడేది కరెక్ట్ కాదని చెప్తూనే.. సరే ఇక నీ ఇష్టం అలాగే కానీ అన్నారు. ఏం చేస్తాం అది తన అలవాటని వేణుమాధవ్ చెప్పుకొచ్చారు.

నేను వున్న చోటు నుంచి షూటింగుకి వెళ్లడానికి కొంత ఆలస్యం అవుతుంది. ఆ విషయాన్ని ముందుగానే చెప్తా ను. అంతేగానీ ఉద్దేశ పూర్వకంగా ఆలస్యంగా వెళ్లను. ఇక నేను పెద్ద హీరోలను కూడా వెయిట్ చేస్తాననే మాటలో నిజం లేదు. ఒక చోట షూటింగ్ పూర్తి కాగానే మరో షూటింగ్‌కి వెళ్లేవాడిని. మధ్యలో ప్రయాణానికి కొంత సమయం పడుతుంది కదా.. అని ప్రశ్నించారు. పెద్ద హీరోలతో చాలా చనువుగా వుంటానని వేణు మాధవ్ చెప్పాడు. 


Widgets Magazine
Widgets Magazine

దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

నెపోలియన్‌ రివ్యూ రిపోర్ట్: నా నీడపోయిందని పోలీస్ స్టేషన్లో కంప్లెంట్..

ఈ కథ మైండ్‌గేమ్‌తో సాగేది. సామాన్యుడికి కాస్త కన్‌ఫ్యూజ్‌గానూ వుంటుంది. కానీ ఇలాంటి ...

news

సుధీర్, అదితీరావ్ జంటగా హైదరీ: జెంటిల్‌మెన్ దర్శకుడి కొత్తచిత్రం

మోహ‌న‌కృష్ణ ఇంద్ర‌గంటి ద‌ర్శ‌క‌త్వంలో నాని హీరోగా శ్రీదేవి మూవీస్ ప‌తాకంపై శివ‌లెంక ...

news

పెళ్లికి తర్వాత నమిత సినిమాలకు దూరం కాదు: వీరేంద్ర చౌదరి

తిరుపతిలో ప్రముఖ హీరోయిన్ నమిత వివాహం ఘనంగా జరిగింది. హీరో, నిర్మాత వీరేంద్ర చౌదరిని నమిత ...

news

పద్మావతికి రూ.140 కోట్లు బీమా.. సంజయ్ భన్సాలీ ముందు జాగ్రత్త

దీపికా పదుకునే, రణ్ వీర్ సింగ్, షాహిద్ కపూర్ నటించిన పద్మావతి' సినిమాను రూ. 190 కోట్ల ...