గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By CVR
Last Updated : మంగళవారం, 30 జూన్ 2015 (20:17 IST)

హాస్యనటుడిని ప్రేమిస్తున్న 'జబర్దస్త్' యాంకర్... ఇంటర్నెట్‌లో ఫోటోలు హల్‌చల్..

టాలీవుడ్‌లో యాంకర్‌గా బుల్లితెరకు పరిచయమై, కోలీవుడ్‌లో హీరోయిన్‌గా దూసుకుపోతున్న నటి రేష్మి గౌతమ్. ఈ బ్యూటీ 'జబర్దస్త్' కార్యక్రమంతో యాంకర్‌గా ప్రాచుర్యం పొందింది. ఇటీవల రేష్మీ తెలుగు సినీ పరిశ్రమకు చెందిన ఒక కమేడియన్‌ను ప్రేమిస్తున్నట్టు వార్తలు వెలువడ్డాయి. అయితే ఆ కమేడియన్ ఎవరనే విషయం ఇన్నాళ్లు తెలియలేదు. 
 
ఐతే రేష్మి తన ప్రియుడితో ఉన్న ఫోటోలు ఇంటర్నెట్‌‌లో హల్‌చల్ చేస్తుండటంతో అతను తెలుగు చిత్రాల్లో నటిస్తున్న కమేడియన్ సుధీర్ అని తెలిసింది. రేష్మీ, సుధీర్‌తో పీకల్లోతు ప్రేమలో మునిగి తేలుతుందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. వీరిద్దరూ కలిసి ఉన్న ఫోటోలు ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తుండటంతో వారి మధ్య రొమాన్స్ నిజమేననే ప్రచారం జరుగుతోంది. 
 
వీరిద్దరు ఇప్పటివరకు కలిసి నటించలేదు. దీంతో రేష్మీ, సుధీర్ కలిసి ఉన్న ఫోటోలు సినిమా కోసం చిత్రించినవి కావని, నిజంగానే రొమాన్సుకు సంబంధించిన ఫోటోలేనని టాలీవుడ్ టాక్. తమిళంలో 'కండేన్' చిత్రంలో నటించిన రేష్మీ ప్రస్తుతం 'మాప్పిల్లై వినాయకర్', 'ప్రియముడన్ ప్రియా' చిత్రాల్లో నటిస్తోంది.