శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By DV
Last Updated : శుక్రవారం, 27 నవంబరు 2015 (10:48 IST)

పవన్‌ కళ్యాణ్‌ సొంత ఛానల్‌?: కమల్, మహేష్ కోవలోనే సర్దార్!

నటుడిగా.. ఎంతో పేరు వున్న పవన్‌ కళ్యాణ్‌.. రాష్ట్ర ప్రభుత్వాన్నే శాసించే స్థాయికి ఎదిగాడు. అందుకే ఆయన తన గురించిన వివరాలను అభిమానులకు, ప్రజలకు దగ్గరవ్వాలనే ఓ ఛానల్‌ పెడితే బాగుంటుందనే ఆలోచనలోకి వచ్చాడు. ఇందుకు సంబంధించిన ప్లాన్‌లు జరుగుతున్నాయి. వివరాల్లోకి వెళితే.. యూట్యూబ్‌ ఛానల్స్‌ ఇప్పుడు ఎక్కువగా నడుస్తున్నాయి. యూత్‌ బాగా ఫాలో అవుతున్నారు. 
 
కమల్‌హాసన్‌ కూడా తన పేరుతో ఓ యూట్యూబ్‌ ఛానల్‌ ప్రారంభించాడు. అందులో తనకు సంబంధించిన ప్రతి విషయాలను పెట్టి అభిమానులను యాక్టివిటీ చేశాడు. అలాగే మహేష్‌బాబు కూడా 40వ పుట్టినరోజు సందర్భంగా తన పేరుతో ఓ యూట్యూబ్‌ ఛాల్‌ ప్రారంభించాడు. మహేష్ సినిమాలకు సంబంధించిన వివరాలన్నీ అందులో వున్నాయి. 
 
ఒకప్పుడు వెబ్‌సైట్‌లాగా ఇప్పుడు యూట్యూబ్‌ దాన్ని ఆక్రమించింది. అదే కోవలో పవన్‌ ఉన్నాడు. ప్రముఖ డిజైనర్‌ దీని పనుల్లో బిజీగా వున్నారు. పవన్‌.. సినిమాలు. రాజకీయ విషయాలు అన్నీ ఇందులో వుంటాయి. క్రమేణా క్రేజ్‌ సంపాదించకునేందుకు ఇది చాలా వుపయోగడుతుందని ఆయన సన్నిహితులు అంటున్నారు.