Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

రూ.2వేల కోట్ల వసూళ్లతో ''దంగల్'' అదుర్స్.. అవతార్, జురాసిక్ వరల్డ్ సరసన?

మంగళవారం, 27 జూన్ 2017 (15:15 IST)

Widgets Magazine

బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ నటించిన దంగల్ సినిమా రికార్డులను తిరగరాస్తోంది. భారత్ కంటే చైనాలో అత్యధిక కలెక్షన్లు సాధించిన ఈ సినిమా తాజాగా, ప్రపంచ వ్యాప్తంగా రూ.2 వేల కోట్లు వసూలు చేసిన తొలి భారతీయ చిత్రంగా చరిత్ర సృష్టించింది. ఈ మేరకు ప్రతిష్ఠాత్మక ఫోర్బ్స్ మేగజైన్ పేర్కొంది. చైనాలో 53వ రోజున రూ.2.5 కోట్లు వసూలు చేయడంతో, ప్రపంచ వ్యాప్తంగా మొత్తం రూ.2 వేల కోట్లు (307 మిలియన్ డాలర్లు) వసూలు చేసిన తొలి భారతీయ చిత్రంగా ఇది రికార్డు సాధించింది. 
 
అలాగే ఇంగ్లీషేతర సినిమాల్లో అత్యధిక వసూళ్లలో దంగల్ సినిమా ఐదో స్థానాన్ని కైవసం చేసుకుంది. ఇక చైనాలో అత్యధిక వసూళ్ల సాధించిన తొలి 16 హాలీవుడ్ యేతర సినిమాల్లో దంగల్ కూడా స్థానం దక్కించుకుంది. ఫలితంగా దంగల్ ప్రస్తుతం ప్రపంచంలో అతిపెద్ద బ్లాక్ బస్టర్ సినిమాలైన ‘అవతార్’, ‘జురాసిక్ వరల్డ్’ సినిమాల సరసన నిలిచింది. అవతార్, జురాసిక్ వరల్డ్ సినిమాలు చైనా బాక్సాఫీసు వద్ద 15, 14 స్థానాల్లో నిలవగా ఆ తర్వాతి స్థానంలో దంగల్ నిలిచింది.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

ఛాన్సుల కోసం డైరెక్టర్ల వెంటపడుతున్న హీరోయిన్?

రాయ్ లక్ష్మి.. ఈ పేరు వినగానే ముందుగానే కాంచన సినిమా గుర్తుకొస్తుంది. లారెన్స్ పక్కన ఈ ...

news

జూ.ఎన్టీఆర్ పడక గదిలో కెమెరాలు.. ఎందుకో తెలుసా? (Video)

వెండితెర హీరో జూనియర్ ఎన్టీఆర్ బుల్లితెర ఎంట్రీకి సిద్ధమవుతున్నారు. బాలీవుడ్ హీరో ...

news

నా యాటిట్యూడ్ వల్లే గబ్బర్ సింగ్.. విమర్శించడానికి మీరెవరు : హరీష్ శంకర్

"నా యాటిట్యూడ్ వల్లే గబ్బర్ సింగ్ వచ్చింది. మంచి ఎంటర్‌టైనర్ వస్తే, రెవెన్యూలు చూడాలి ...

news

మోస్ట్ డిజైరబుల్ మెన్ లిస్టు నుంచి దిగజారిన మహేష్ బాబు.. ఏకంగా ఏడో స్థానానికి?

స్పైడర్ హీరో మోస్ట్ డిజైరబుల్ మెన్ లిస్టు నుంచి దిగజారాడు. సూపర్ స్టార్ మహేష్ బాబు మోస్ట్ ...

Widgets Magazine