గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By DV
Last Updated : గురువారం, 28 ఏప్రియల్ 2016 (11:04 IST)

ధనుష్‌, కాజల్‌ల 'మాస్‌': 29న సినిమా రిలీజ్

ధనుష్‌, కాజల్‌ జంటగా తమిళంలో విడుదలైన 'మారి' తెలుగులో 'మాస్‌' పేరుతో అనువాదమవుతోంది. వి.ఎం.అర్‌ సమర్పణలో జయప్రద పిక్చర్స్‌ పతాకంపై వాసిరెడ్డి పద్మాకరరావు అందిస్తున్నారు. 'లవ్‌ ఫెయిల్యూర్‌' ఫేం బాలాజీ మోహన్‌ దర్సకత్వం వహించిన ఈ చిత్రానికి 'వై దిస్‌ కొలవేరి ఫేం' అనిరుధ్‌ సంగీతం అందించారు. ఈ చిత్రాన్ని ఈ నెల 29న విడుదల  చేస్తున్నారు. 
 
నిర్మాత వాసిరెడ్డి పద్మాకరరావు మాట్లాడుతూ.. ధనుష్‌ పెర్ఫార్మెన్స్‌, కాజల్‌ గ్లామర్‌, అనిరుధ్‌ మ్యూజిక్‌, సాహితి అందించిన మాటలు, పాటలు బాలాజీ మోహన్‌ స్క్రీన్‌ ప్లే, దర్శకత్వం ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణలు. మాస్‌తో పాటు క్లాస్‌ ఆడియన్స్‌నూ అమితంగా అలరించే చిత్రమిది. తెలుగులోనూ కచ్చితంగా ఘన విజయం సాధిస్తుందనే నమ్మకముంది'' అన్నారు. విజయ్‌ ఏసుదాస్‌, రోబో శంకర్‌ తదిరులు ఇతర ముఖ్య పాత్రలు పోషించారు.