Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

స్త్రీ పాత్రలకు ప్రాధాన్యం ఇచ్చిన మరో బాలచందర్ మన దాసరి

హైదరాబాద్, బుధవారం, 31 మే 2017 (06:05 IST)

Widgets Magazine

వెండితెరను నమ్ముకొని వచ్చిన దారి దొరకని తమ్ముళ్లకు దోవ తెలియని చెల్లెళ్లకు గూడు అయ్యింది దాసరి నారాయణ రావే. హీరో ఓరియంటెడ్ చిత్రాలే తీసినప్పటికీ తన చిత్రాల్లో స్త్రీ పాత్రలకు అత్యంత గౌరవాన్ని ఇచ్చి ప్రతిష్టించిన దర్శకుడు దాసరి. ఒక్కమాటలో చెప్పాలంటే తెలుగు చిత్రసీమలో మహిళల పట్ల పక్షపాత దృష్టిని ప్రదర్శించిన అరుదైన దర్శకులలో దాసరి అగ్రగణ్యులు. తాతామనవడు సినిమా తర్వాత ఆయన తీసిన ‘సంసారం సాగరం’, ‘బంట్రోతు భార్య’, ‘స్వర్గం–నరకం’ తూర్పు పడమర వంటి తొలిసినిమాలు స్త్రీపాత్రలకు ఒక ఔన్నత్యాన్ని సంపాదించిపెట్టాయి. 
dasari-jaya
 
ఏయన్నార్‌తో  ‘ప్రేమాభిషేకం’, ‘మేఘసందేశం’, ఎన్టీఆర్‌తో ‘సర్దార్‌ పాపారాయుడు’, ‘బొబ్బిలి పులి’ వంటి సూపర్‌ హిట్‌ సినిమాలు తీశారు. కృష్ణ, కృష్ణంరాజు, శోభన్‌బాబు... ఇలా నాటి తరం హీరోలతో పలు విజయవంతమైన చిత్రాలు తీశారు. ఆ తర్వాత చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేశ్‌లతో కూడా సినిమాలు తెరకెక్కించారు.

కానీ దాసరి దర్శకత్వం వహించిన కొన్ని సినిమాలు చూస్తే ఆయన మహిళా పక్షపాతి అనిపిస్తుంది. ఉదాహరణకు, ‘శివరంజని’, ‘కంటే కూతుర్నే కను’, ‘ఒసేయ్‌ రాములమ్మ’, ‘అమ్మ రాజీనామా’ వంటివి. 
 
సీతారాములు సినిమాలో పారిశ్రామిక వేత్తగా,  గృహిణిగా జయప్రదను దాసరి తీర్చి దిద్దిన వైనం అనితర సాధ్యం. అలాగే తాండ్రపాపారాయుడు సినిమాలో పాపారాయుడిని ప్రేమించి అతడి శఫథం నెరవేర్చడం కోసం భగ్న ప్రేమికురాలిగా మిగిలిపోయి జీవితాన్నే త్యాగం చేసిన వీరవనితగా పాత్రకు కల్పించిన అద్భుతం అనే చెప్పాలి.

గోరంటాకు వంటి సినిమాల ద్వారా మలయాళ నటి సుజాతను ఒక్కసారిగా పైకి లేపారు దాసరి. ఇక ప్రేమాభిషేకం సినిమాలో పాత్రకు ప్రాణ ప్రతిష్ట కల్పించారు. జయసుధ, జయప్రద, సుజాత, వంటి ఎంతోమంది తారలను పరిచయం చేసిన ఘనత ఆయనది. తూర్పుపడమర వంటి తొలి సినిమాల్లో స్త్రీ పాత్రలను అత్యంత వైవిధ్య పూరితంగా మలిచారు.
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

అమ్మానాన్నలకు అన్నం పెట్టని అరాచకానికి పాతరేసిన దాసరి: 'తాతా మనవడు'తో విశ్వరూపం

నాటకాలపిచ్చితో మొదలై సినిమా వరకు లాగిన దాసరి నారాయణ రావు సినీ జీవితం కూడా భయంకర కష్టాల ...

news

మహా భారతం డ్రీమ్ ప్రాజెక్ట్.. పవన్ కల్యాణ్‌తో బోస్... దాసరి తీరని కోరికలు...

తాండ్ర పాపారాయుడు, విశ్వనాథ నాయకుడు వంటి చారిత్రక సినిమాలను తీసి అఖండ విజయం సాధించిన ...

news

కష్టాల కొలిమిలో కాలి కాలి... కళామతల్లి ఒడిలో తరించిన దాసరి

పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో 1945 మే 4న సాయిరాజు, మహాలక్ష్మీ దంపతులకు జన్మించిన ...

news

దాసరి కన్నుమూత... మిస్ యూ సర్-పవన్, భారతీయ సినీ ఇండస్ట్రీకి లోటు-రజినీకాంత్

దర్శకరత్న దాసరి నారాయణ రావు స్వర్గస్తులయ్యారని తెలిసి ఇండియన్ సినీ ఇండస్ట్రీ ...

Widgets Magazine