Widgets Magazine Widgets Magazine

ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయని నిర్మాత... చివరి రోజుల్లో దాసరి పరిస్థితి... పవన్ ఒక్కడే ఆదుకుంటాడనీ?

శనివారం, 10 జూన్ 2017 (20:11 IST)

Widgets Magazine
Dasari Narayana Rao

దాసరి నారాయణరావు అంటే తెలుగు సినీ ఇండస్ట్రీలో వున్న పేరు గురించి వేరే చెప్పాల్సిన పనిలేదు. అలాంటి దాసరి నారాయణరావును నమ్ముకున్నవారే ముంచేసినట్లు టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో చర్చ జరుగుతోంది. కష్టాల్లో వున్నవారికి దాసరి నోట్లు, పత్రాలు లేకుండా కోట్లకు కోట్లు డబ్బులిచ్చేశేవారట. ఏ నిర్మాత అయినా ఆర్థిక కష్టాల్లో చిక్కుకుని పోతే దాసరిని కలిసేవాడట. అంతే... వెంటనే వారికి అవసరమైన డబ్బును సర్దుబాటు చేసేవారట దాసరి. 
 
చిన్న నిర్మాతల నుంచి పెద్ద నిర్మాతల్లో కొందరు ఇలా దాసరి సహాయాన్ని తీసుకున్నవారేనని సమాచారం. దాసరి ఒకప్పుడు చెన్నై నుంచి హైదరాబాద్ విమానంలో వస్తే విమానాశ్రయం వద్ద నిర్మాతలు క్యూ కట్టుకుని నిలుచుండేవారు. దాసరి ఓకే అంటే బ్లాంక్ చెక్కులను ఇచ్చేందుకు సైతం పోటీపడేవారు. అలాంటిది దాసరి చివరి రోజుల్లో ఆయన వద్ద డబ్బు తీసుకున్నవారు కూడా ముఖం చాటేశారని సమాచారం. 
 
ఓ నిర్మాత రూ. 15 కోట్లు తీసుకుని దాసరి ఆసుపత్రి ఖర్చుల కోసం ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయకుండా తప్పించుకుని తిరిగాడట. చివరి వరకూ దాసరి వద్దకు రానేలేదట. ఐతే ఆయనకు ఎలాంటి నోట్లు, అగ్రిమెంట్లు లేకుండా కేవలం నోటి మాట ద్వారానే ఆ డబ్బు ఇచ్చినట్లు చెప్పుకుంటున్నారు. ఇలా ఎంతోమందికి దాసరి సహాయం చేశారని తెలుస్తోంది. ఐతే ఆయన ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యాక ఖర్చులు భారీగా అయ్యాయనీ, వాటి కోసం ఇళ్లు, ఆస్తులు తనఖా పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి. 
 
ఇలాంటి ఆర్థిక కష్టాల నుంచి తప్పించుకునేందుకే చివరికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒక్కడే తనను ఆదుకోగలడనీ, ఆయన డేట్స్ కోరినట్లు సమాచారం. ఇంతలో విధి వక్రీకరించి ఆయన స్వర్గస్తులయ్యారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

విడాకులకు కారణం నేనే... నా భర్త చాలా మంచోడు... మనీషా కొయిరాలా... మాజీ భార్యలు ఎందుకిలా?

ఈమధ్య సినీ ఇండస్ట్రీలో విడాకులు తీసుకున్న నటీమణులు ఆ తర్వాత తామే తప్పు చేశామనీ, తమ భర్తలు ...

news

చిరంజీవికి బుల్లితెరపై మరో అవమానం... ఏం చెప్పుకున్నా ఏం లాభం?

మెగాస్టార్ చిరంజీవి చిత్రం ఖైదీ నెం. 150 సృష్టించిన రికార్డులు గురించి తెలిసిందే. దాదాపు ...

news

పోర్చుగల్‌లో రోడ్డు పక్కన పడుకున్న బాలయ్య... ఎంత సింప్లిసిటీ!

సాధారణంగా సినీ స్టార్స్‌కు లగ్జరీ సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి. అలాంటి సౌకర్యాలను నిర్మాత ...

news

మా ఇద్దరి మధ్య "ఆ" లింకు ఉన్నా మీకేంటి నష్టం : హెబ్బాపటేల్

హీరో రాజ్ తరుణ్, హీరోయిన్ హెబ్బాపటేల్‌ మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తోందనే వార్తలు ఫిల్మ్ ...