గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ivr
Last Modified: మంగళవారం, 31 జనవరి 2017 (18:30 IST)

దాసరి అన్నవాహికకు రాపిడి ఏర్పడింది... సెన్సిటివ్ ఇష్యూ... మళ్లీమళ్లీ అడగొద్దు....

దర్శకరత్న దాసరి నారాయణ రావు అనారోగ్య సమస్య చాలా సున్నితమైనదనీ, దాని గురించి తమను మళ్లీమళ్లీ అడుగవద్దని వైద్యులు తెలిపారు. హెల్త్ బులిటెన్ విడుదల చేసిన తర్వాత వైద్యులు మాట్లాడుతూ... దాసరి అనారోగ్య సమస్యలతో రెండు రోజుల క్రితం కిమ్స్‌లో చేరారన్నారు. పరీ

దర్శకరత్న దాసరి నారాయణ రావు అనారోగ్య సమస్య చాలా సున్నితమైనదనీ, దాని గురించి తమను మళ్లీమళ్లీ అడుగవద్దని వైద్యులు తెలిపారు. హెల్త్ బులిటెన్ విడుదల చేసిన తర్వాత వైద్యులు మాట్లాడుతూ... దాసరి అనారోగ్య సమస్యలతో రెండు రోజుల క్రితం కిమ్స్‌లో చేరారన్నారు. పరీక్షలు చేసిన తర్వాత ఆయన అన్నవాహికలో రాపిడి ఏర్పడి ఇబ్బంది తలెత్తినట్లు గుర్తించి దానికి ట్యూబ్ పెట్టి శుద్ధి చేసిన తర్వాత రాపిడి ప్రదేశంలో మెటల్ స్టెంట్ వేసినట్లు వెల్లడించారు. 
 
దాంతో ఆయన శరీరంలోని మూత్రపిండాలు, ఊపిరితిత్తుల్లో సమస్యలు ఏర్పడ్డాయనీ, అందువల్ల ఆయన కిడ్నీలకు డయాలసిస్, ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ తొలగించామనీ, ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా వున్నట్లు చెప్పారు. మూడు రోజులుపాటు పూర్తిగా తమ పర్యవేక్షణలో చికిత్స అందించాలనీ, కనుక ఆయన ఆరోగ్య సమస్య గురించి పదేపదే అడగవద్దని వారు తెలిపారు. ఇదిలావుండగా దాసరి ఆరోగ్యంపై మోహన్ బాబు, కె. రాఘవేంద్ర రావు తదితరులు వాకబు చేశారు. దాసరి త్వరగా కోలుకుంటారని మోహన్ బాబు అన్నారు.