శుక్రవారం, 29 మార్చి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By DV
Last Modified: మంగళవారం, 9 ఫిబ్రవరి 2016 (21:44 IST)

ఇండస్ట్రీని దాసరి 'కాపు' కాస్తున్నారు!

నిన్న ముద్రగడ పద్మనాభం దీక్ష విరమించిన తర్వాత అక్కడికి వెళ్ళి మద్దతు పలికేందుకు వచ్చిన దాసరి నారాయణరావును, చిరంజీవిలను అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. కాగా, మంగళవారం నాడు దాసరి హైదరాబాద్‌ వచ్చారు. ఈ విషయం తెలిసిన సినీరంగంలోని కాపు వర్గానికి చెందిన కొందరు దాసరిని అభినందించారు. అందులో కాపు కాకపోయినా.. ఆర్‌.నారాయణమూర్తి తన గురువును అభినందించారు. ఇదిలావుండగా, కాపు నేపథ్యంలో ప్రజాగర్జన పేరుతో ఓ చిత్రాన్ని తీయడానికి నాయుడు అనే దర్శకనిర్మాత ముందుకు వచ్చాడు. 
 
అంతకుముందే.. రంగా జీవిత చరిత్రను తెరకెక్కించే పనిలో ధవళ సత్యం.. ఒక వైపు... రామ్‌గోపాల్‌ వర్మ మరోవైపు ప్రకటించారు. అసలు కాపు సభ జరగడానికి ముందే ఈ సినిమాలు ప్రకటించడం వెనుక ఏదో ఉద్దేశ్యం వుందని సినీ విశ్లేషకులు తెలియజేస్తున్నారు. 
 
అయితే ప్రస్తుతం.. ఇండస్ట్రీలో కమ్మ వర్గం బాగా పాతుకుపోయి వుంది. వారికి ధీటుగా వుండాలంటే కాపు వర్గం మరింత బలవంతంగా తయారుకావాలని మంగళవారం నాడు దాసరి ముందు కొంతమంది కాపు దర్శక నిర్మాతలు పేర్కొన్నారు. భవిష్యత్‌లో దాసరి.. జగన్‌ పార్టీలో చేరే ఆలోచనలో వున్నట్లు తెలుస్తోంది. సో.. ఇకపై ఇండస్ట్రీలో రెండు వర్గాల ప్రాబల్యం వుంటుందని తెలుస్తోంది.