శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : గురువారం, 13 అక్టోబరు 2016 (12:36 IST)

హీరోయిన్లు తెలుగులో మాట్లాడితేనే ఫంక్షన్లకు వస్తా : దాసరి నారాయణరావు

దర్శకరత్న దాసరి నారాయణ రావు సంచలన కామెంట్స్ చేశారు. తెలుగు చిత్ర పరిశ్రమ కాస్త ఆంగ్ల చిత్ర పరిశ్రమగా మారిపోతోందని, ఆర్టిస్టులు ముఖ్యంగా హీరోయిన్లు ఇంగ్లీషులో మాట్లాడుతున్నారని ఆయన ఆరోపించారు.

దర్శకరత్న దాసరి నారాయణ రావు సంచలన కామెంట్స్ చేశారు. తెలుగు చిత్ర పరిశ్రమ కాస్త ఆంగ్ల చిత్ర పరిశ్రమగా మారిపోతోందని, ఆర్టిస్టులు ముఖ్యంగా హీరోయిన్లు ఇంగ్లీషులో మాట్లాడుతున్నారని ఆయన ఆరోపించారు. 
 
ఇకపై హీరోయిన్లు తెలుగులో మాట్లాడకపోతే, తాను ఫంక్షన్స్ నుంచి వాకౌట్ చేసి నిరసన తెలుపుతానని హెచ్చరించారు. ఏ భాష నుంచి వచ్చిన హీరోయిన్లయినా, వారిని తెలుగు పరిశ్రమ గౌరవిస్తుందని, కాబట్టి వారంతా తెలుగు నేర్చుకుని రావాలని తాను సిన్సియర్ సలహా ఇస్తున్నానని చెప్పారు. 
 
ఇప్పుడు వేదికపై ఉన్న హీరోయిన్లు రాయ్ లక్ష్మి, నికిషా పటేల్, అరుంధతీ నాయర్‌లు తదుపరి స్టేజ్ ఎక్కేలోగా తెలుగులో మాట్లాడాలని, లేకుంటే ఆ సభ నుంచి తాను వెళ్లిపోతానని అన్నారు. దాసరి గతంలో కూడా ఇదే తరహా వ్యాఖ్యలు చేశారు కూడా. అయినప్పటికీ హీరోయిన్ల వైఖరిలో ఎలాంటి మార్పు రాలేదు.