శ్రీదేవి ఎలా స్పృహ తప్పి పడిపోయిందో చెప్పరా? సోషల్ మీడియాలో ప్రశ్నలు

శనివారం, 3 మార్చి 2018 (11:30 IST)

దివంగత నటి శ్రీదేవి మరణాన్ని ఆమె అభిమానులు ఏమాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు. శ్రీదేవి మరణించి రోజులు గడిచినా.. ఆమెది సహజమరణమేనా అంటూ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. స్పృహ తప్పిపోయి బాత్‌లో పడి శ్రీదేవి మృతి చెందిందని సౌదీ ప్రాసిక్యూషన్ చెప్పడంపై సంతృప్తి చెందట్లేదు.

ఫిబ్రవరి 24 రాత్రి దుబాయ్‌లోని ఒక హోటల్‌లో శ్రీదేవి ప్రమాదవశాత్తు బాత్‌ టబ్‌లో పడి మృతి చెందారని ఫోరెన్సిక్ నివేదిక వెల్లడించిన నేపథ్యంలో.. ఆ నివేదికలో ఆమె స్పృహ తప్పిపోవడానికి గల కారణాలను ఎందుకు వివరించలేదని.. అభిమానులు సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు.
 
వివాహ వేడుకలో సరదాగా గడిపిన శ్రీదేవి ఎలా స్పృహ తప్పి పడిపోయిందని వారు అడుగుతున్నారు. కనీసం కుటుంబ సభ్యులు కూడా దీనిపై ఎందుకు స్పందించట్లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా శ్రీదేవి తెలుగు, తమిళం, మలయాళం, హిందీ సినిమాల్లో అగ్ర నటిగా కొనసాగిన సంగతి తెలిసిందే.

పెళ్లయ్యాక సినిమాలకు దూరమైన శ్రీదేవి.. ఇంగ్లీష్ వింగ్లీష్ చిత్రంతో రీ ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాలో ఓ గృహిణిగా చీరకట్టులో అద్భుతమైన నటనతో ఆకట్టుకుని.. బంపర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకుంది. ఆపై మామ్ చిత్రంలోనూ తనదైన శైలిలో నటనతో అదుర్స్ అనిపించింది.దీనిపై మరింత చదవండి :  
శ్రీదేవి దుబాయ్ సోషల్ మీడియా Februry Sridevi Camera Dubai Social Media Boney Kapoor Sridevi Passes Away

Loading comments ...

తెలుగు సినిమా

news

''అర్జున్ రెడ్డి''తో రొమాన్స్ చేయనున్న మెహ్రీన్..?

అర్జున్ రెడ్డి తాజా సినిమాలో అందాల రాశి మెహ్రీన్ నటించనుంది. తెలుగు తెరపై గ్లామర్ పంట ...

news

రామేశ్వరంలో శ్రీదేవి అస్థికలు కలుపనున్న బోనీ కపూర్

అతిలోక సుందరి శ్రీదేవి.. అస్థికలను రామేశ్వరంలో నిమజ్జనం చేసేందుకు ఆమె కుటుంబీకులు ...

news

''రంగా రంగా రంగస్థలానా'' పాట వీడియో

సుకుమార్, రామచరణ్ కాంబినేషన్‌లో రూపుదిద్దుకున్న ''రంగస్థలం'' సినిమాలోని రంగా రంగా ...

news

ఇప్పుడే తల్లిని చేయవద్దన్న నటి... కానీ ఒప్పేసుకుందట...

అన్నా నా భర్తను చంపేయ్... అన్నా.. ఇలాంటి వారి వల్ల సమాజానికి చెడ్డ పేరన్నా అంటూ ...