శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ivr
Last Modified: మంగళవారం, 1 సెప్టెంబరు 2015 (16:41 IST)

'షోలే'తో పెట్టుకున్న రాంగోపాల్ వర్మ... ఢిల్లీ కోర్టు రూ. 10 లక్షల జరిమానా

రాంగోపాల్ వర్మ ఉండచోట ఉండడు. ఏదో ఒకటి కాంట్రవర్శీలో తలదూర్చుతూనే ఉంటారని టాలీవుడ్ జనం అనుకుంటూ ఉంటారు. ఇప్పుడు కూడా మళ్లీ అదే జరిగింది. షోలే చిత్రంతో పెట్టుకున్నాడు. 1975లో విడుదలైన బ్లాక్‌బ్లాస్టర్ మూవీ షోలే కాపీరైట్ హక్కులను ఉద్ధేశ్యపూర్వకంగా అతిక్రమించారని వర్మకు ఢిల్లీ కోర్టు రూ.10 లక్షల జరిమానా విధించింది.
 
ఇంతకీ విషయం ఏంటయా అంటే... షోలే మీడియా అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో ఉన్న కాపీరైట్ హక్కులను రాంగోపాల్ వర్మ కీ షోలే పేరుతో ఉల్లంఘించారంటూ షోలే నిర్మాత కుమారుడు విజయ్‌సిప్పి, మనవడు జీపీ సిప్పీ కోర్టును ఆశ్రయించారు. ఈ పిటీషన్‌పై విచారణ చేపట్టిన ఢిల్లీ కోర్టు రాంగోపాల్ వర్మకు రూ.10 లక్షల జరిమానా విధించింది.