శుక్రవారం, 29 మార్చి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 1 సెప్టెంబరు 2015 (16:13 IST)

దేవీ శ్రీ ప్రసాద్ ఛార్మీకి బ్రదరా? రాఖీ కట్టిందా? శ్రీదేవిలా?

ఛార్మీ-దేవీ శ్రీ ప్రసాద్‌ల మధ్య సంథింగ్ సంథింగ్ అంటూ ఫిలిమ్ నగర్ వర్గాల్లో రూమర్స్ వస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఛార్మీ మాత్రం దేవీ శ్రీ ప్రసాద్ సోదరుడికి రాఖీ కట్టింది. దీంతో సినీ జనమంతా నోరెళ్లబెట్టారు. దేవీ శ్రీ ప్రసాద్ సోదరుడు సాగర్ (సింగర్)కు ఛార్మీ రాఖీ కట్టింది.
 
రాఖీ పండుగ రోజున సాగర్‌కు రాఖీ కట్టిన ఛార్మీ.. సాగర్ తనకు దేవుడిచ్చిన మంచి గిఫ్ట్ అని వ్యాఖ్యానించింది. అయితే ఛార్మీ రాఖీ కట్టడంతో సినీ జనమంతా.. మరి దేవీ శ్రీ ప్రసాద్‌ను కూడా ఛార్మీ సోదరుడిగా భావిస్తుందా లేకుంటే.. దేవిని లవర్‌గా భావిస్తుందా అనే అనుమానం తలెత్తింది. 
 
అయితే సినీ ఇండస్ట్రీలో రాఖీ కట్టడం.. తర్వాత వారినే పెళ్లాడటం సహజమని సినీ పండితులు అంటున్నారు. ఈ కోవలోనే బాలీవుడ్ జంట శ్రీదేవి-బోనీ కపూర్‌ల వివాహం జరిగిందంటున్నారు. శ్రీదేవి తాను అగ్రనటిగా కొనసాగిన తరుణంలో బోనీ కపూర్‌కు రాఖీ కట్టింది. ఆపై ప్రేమలో పడిన ఈ జోడీ పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. బోనీ కపూర్ ఏకంగా తన తొలి భార్యకు విడాకులిచ్చి మరీ శ్రీదేవిని మనువాడారు.