Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

అమీర్ ముందు తెలుగు హీరోలందరూ బలాదూర్: ఒక్క సినిమాకు 175 కోట్లు

హైదరాబాద్, సోమవారం, 20 మార్చి 2017 (09:13 IST)

Widgets Magazine

ఒక సినిమా కోసం ‘మిస్టర్ పర్ ఫెక్ట్’ అమీర్ ఖాన్ ఎంత పారితోషికం తీసుకుంటాడో సిల్వర్ స్క్రీన్ పైన తెలియదు గానీ, ఎంతగా కష్టపడతాడో మాత్రం కళ్ళకు కట్టినట్లుగా కనపడుతుంది. మరి అంతలా కష్టపడే ఈ ‘మిస్టర్ పర్ ఫెక్ట్’ ఒక్కో సినిమాకు ఎంత రెమ్యూనరేషన్ ను తీసుకుంటారు అంటే అన్ని సినిమాల సంగతి ఏమో గానీ, తాజాగా అమీర్ నటించి, బాక్సాఫీస్ వద్ద కనకవర్షం కురిపించిన “దంగల్” సినిమాకు సంబంధించిన విషయం మాత్రం బయటకు వచ్చింది.
Aamir khan
 
విలక్షణ నటుడు ఆమిర్‌ ఖాన్ నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద కాసులవర్షం కురిపిస్తుంటాయి. బాలీవుడ్ లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాల్లో ఎక్కువ అతడివే ఉంటాయి. సినిమా కలెక్షన్ల విషయంలోనే కాదు వ్యక్తిగత రెమ్యునరేషన్ లోనూ 'మిస్టర్ పర్ఫెక్ట్' ముందున్నాడు. ఆమిర్ తాజా చిత్రం 'దంగల్'తో అతడు రూ.175 కోట్లు ఆర్జించినట్టు 'డీఎన్ఏ' పత్రిక వెల్లడించింది. విశ్వసనీయ వర్గాల ద్వారా సంపాదించిన సమాచారం ప్రకారం ఈ వివరాలు వెల్లడించింది.
 
'దంగల్ సినిమా ద్వారా ఆమిర్ ఖాన్ దాదాపు రూ. 175 కోట్లు ఆర్జించాడు. పారితోషికంగా కింద రూ. 35 కోట్లు తీసుకున్నాడు. సినిమా కలెక్షన్లలో 33 శాతం ఆమిర్ తీసుకుంటాడు. అంతకాదు తన సినిమా భవిష్యత్ వసూళ్లలోనూ రాయల్టీ కింద 33 శాతం తీసుకుంటాడ'ని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. దీంతో బాలీవుడ్ లో అత్యధిక పారితోషికం తీసుకునే హీరోగా ఆమిర్‌ ఖాన్ గుర్తింపు పొందాడు. దంగల్ నటి జైరా వసీం ప్రధానపాత్రలో నటించిన 'సీక్రెట్ స్టార్' సినిమాలో ఆమిర్‌ ఖాన్‌ అతిథి పాత్రలో కనిపించనున్నాడు.
 
భవిష్యత్తులో ఈ సినిమా ద్వారా ఎలాంటి ఆదాయం లభించినా కూడా అందులో ఓ 33 శాతం వాటా అమీర్ కు చెందుతుంది గనుక, మ్యాజిక్ ఫిగర్ 200 కోట్లను అమీర్ అందుకోవచ్చని బాలీవుడ్ టాక్. అయితే ఎన్ని కోట్లు అందుకున్నా, ఎంత ఖర్చు పెట్టినా అమీర్ ఖాన్ కున్నంత డెడికేషన్ మరో హీరోకు ఉండదని చెప్పడంలో సందేహం లేదు, మరో మాటకు ఆస్కారం లేదు. కాబట్టి అమీర్ చిత్తశుద్ధి ముందు ఈ కరెన్సీ కట్టలకు విలువ లేదన్నది అసలు నిజం.
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

ఇంత జరిగాక ఇళయరాజాతో ఎలా మాట్లాడాలి: ఎస్పీ బాలు ఆవేదన

తన పాటలు బహిరంగవేదికలపై, పాటల కచ్చేరీలలో పాడొద్దంటూ ప్రముఖ గాయకుడు, సంగీత దర్శకుడు ...

news

ఆ ఖర్మ నాకు పట్టనందుకు హాయిగా ఉందంటున్న కాజల్...!

చిత్రసీమలో చాన్స్ రావాలంటే రాజీ పడాల్సిందే అనేది ఈ మధ్య హీరోయిన్లే పేలుస్తున్న బాంబు. ఆ ...

news

ఆ ఘటన గురించి తల్చుకుంటేనే రక్తం మరుగుతోంది.. ఆగ్రహోదగ్ర లక్ష్మీ మంచు

మలయాళ హీరోయిన్ భావన విషయంలో జరిగిన వేధింపు గురించి తల్చుకుంటేనే రక్తం మరుగుతోందని సినీ ...

news

నేను కంపోజ్ చేసిన పాటలు పాడొద్దు.. బాలుకు ఇళయరాజా నోటీసులు

తాను కంపోజ్ చేసిన పాటలను అంతర్జాతీయ వేదికలమీద తన అనుమతి లేకుండా పాడకూడదని ప్రముఖ సంగీత ...

Widgets Magazine