Widgets Magazine

శ్రీహరి అందుకే చనిపోయారు.. రీ ఎంట్రీ ఇస్తున్నా: డిస్కో శాంతి

విలక్షణ నటుడు శ్రీహరి మృతి ఆమెను కలచివేసింది. ఆ షాక్ నుంచి ఇప్పుడిప్పుడే ఆయన సతీమణి, నటీమణి డిస్కో శాంతి తేరుకుంటున్నారు. తెలుగు తెరపై సందడి చేసిన డిస్కో శాంతి శ్రీహరితో వివాహానికి అనంతరం.. సినిమాలకు

selvi| Last Updated: సోమవారం, 16 ఏప్రియల్ 2018 (18:26 IST)
విలక్షణ నటుడు శ్రీహరి మృతి ఆమెను కలచివేసింది. ఆ షాక్ నుంచి ఇప్పుడిప్పుడే ఆయన సతీమణి, నటీమణి డిస్కో శాంతి తేరుకుంటున్నారు. తెలుగు తెరపై సందడి చేసిన డిస్కో శాంతి శ్రీహరితో వివాహానికి అనంతరం.. సినిమాలకు దూరమయ్యారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో డిస్కో శాంతి రీ ఎంట్రీపై నోరు విప్పారు. ఇంతవరకు తనను ఎవ్వరూ సంప్రదించలేదని... తెలుగు తెరపై తనను మళ్లీ చూసే అవకాశాలున్నట్లు చెప్పారు.
 
కానీ గుంపులో గోవింద అనిపించే పాత్రలు మాత్రం చేసే ప్రసక్తే లేదని.. అంత అవసరం కూడా లేదని తెలిపారు. నటనకు ప్రాధాన్యత గల పాత్రలు వస్తే చేసేందుకు సిద్ధంగా వున్నానని డిస్కో శాంతి చెప్పుకొచ్చారు. పిల్లలు పెద్దవాళ్లయ్యారని.. అందువల్లే నటన వైపు వెళ్లడం బెటరనుకుంటున్నానని.. మళ్లీ రీ ఎంట్రీ ఇస్తే నలుగురి కలవడం, మాట్లాడటం ద్వారా మనసుకి కాస్త ఊరట కలుగుతుందని డిస్కో శాంతి వెల్లడించారు.
 
కాగా శ్రీహరి, డిస్కో శాంతి ప్రేమించి వివాహం చేసుకుని, అన్యోన్య దంపతులు అనిపించుకున్నారు. కానీ శ్రీహరి మరణంతో ఆమె కుంగిపోయారు. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో శ్రీహరి డాక్టర్ల నిర్లక్ష్యం వల్లే చనిపోయారని ఆరోపించారు. వైద్యులు చెప్పినట్టుగా చనిపోయిన రోజు శ్రీహరికి జాండీస్ వ్యాధి ఎక్కువగా ఏమీ లేదని.. ఆయనకి గుండెపోటు కూడా రాలేదని చెప్పారు. ముంబై హాస్పిటల్ రాంగ్ ట్రీట్మెంట్ వల్లనే శ్రీహరి చనిపోయారని చెప్పుకొచ్చారు.


దీనిపై మరింత చదవండి :