Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

డ్రగ్స్ కేసులో రవితేజ పేరుందా? నోటీస్ అందిందా? తీసుకోని ఆ ఇద్దరెవరు? అరెస్టు తప్పదా?

శనివారం, 15 జులై 2017 (15:39 IST)

Widgets Magazine
raviteja

టాలీవుడ్ ఇండస్ట్రీలో డ్రగ్స్ కేసు హీటెక్కిస్తోంది. ఇప్పటికే ఈ కేసులో టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన 19 మంది పేర్లను లిస్ట్ అవుట్ చేయగా వారిలో 12 మంది ఏకంగా నోటీసులు కూడా పంపినట్లు తెలిసిందే. ఐతే 12 మందిలో ఇద్దరు నోటీసులను తీసుకోకుండా తిరస్కరించినట్లు సమాచారం. మరోవైపు 19 మందిలో 12 మందికే నోటీసులు వెళ్లగా మిగిలిన ఏడుగురికి కూడా ఇచ్చే అవకాశం వున్నట్లు తెలుస్తోంది. ఆ ఏడుగురు టాలీవుడ్ ఇండస్ట్రీలో పేరున్న నటులని అంటున్నారు. 
 
మరోవైపు ఇప్పటికే ఈ కేసులో హీరో రవితేజ, డైరక్టర్ పూరి జగన్నాథ్, హీరోయిన్ ఛార్మి, ముమైత్ ఖాన్, కెమెరామ్యాన్ శామ్.కె.నాయుడు, యాక్టర్ సుబ్బరాజు, ఆర్ట్ డైరక్టర్ చిన్నా, హీరోలు తరుణ్, నవదీప్, తనీష్, నందులకు నోటీసులు అందినట్లు ప్రచారం జరిగింది. ఐతే వీరిలో చాలామంది తమకు డ్రగ్స్‌తో ఎలాంటి లింకు లేదనీ, తమకు సిగరెట్లు తాగడమే తెలియదని అలాంటప్పుడు డ్రగ్స్ ఎలా తీసుకోగలమని వాదిస్తున్నారు. 
 
ఇదిలావుంటే డ్రగ్స్ కేసుకు సంబంధించి నోటీసులు అందుకోని కొందరు నటీనటులు బ్యాంకాక్ చెక్కేద్దామని ప్లాన్ చేస్తున్నారట. ఐతే ఎక్సైజ్ అధికారులు మాత్రం ఈ నెల 19 నుంచి 27వ తేదీ మధ్యన నాంపల్లి ఎక్సయిజ్ ఎన్ఫోర్స్‌మెంట్ కార్యాలయం ఎదుట హాజరై వివరణ ఇచ్చిన తర్వాతే వెళ్లాలనీ, దానికి భిన్నంగా ప్రవర్తిస్తే అరెస్ట్ తప్పదని వార్నింగ్ ఇచ్చినట్లు సమాచారం. దీనితో బ్యాంకాక్ వెళ్లాలనుకున్నవారు కాస్తా గప్ చిప్ మని ఇంట్లోనే కూర్చుండిపోయారట. 
 
ఇదిలావుంటే నోటీసులు అందుకోని మరో ఇద్దరు టాలీవుడ్ సెలబ్రిటీల ఇళ్లకు వెళ్లి సిబ్బంది నోటీసులు అందించే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. సిబ్బంది తెచ్చిన నోటీసులు కూడా తీసుకునేందుకు నిరాకరిస్తే వారిని అరెస్టు చేసే అవకాశం వున్నట్లు వార్తలు వస్తున్నాయి. అలాంటి పరిస్థితి వస్తే టాలీవుడ్ ఇండస్ట్రీ పూర్తి షేక్ అవ్వడం ఖాయం.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

కమల్ హాసన్‌‌కు మద్దతు.. ఆయనకొక సమస్య వుంటే ఊరుకోం: విశాల్ వార్నింగ్

సినీ లెజండ్ కమల్ హాసన్ ప్రస్తుతం అందరి నోళ్లల్లో నానుతున్నారు. బిగ్ బాస్ కార్యక్రమానికి ...

news

డ్రగ్స్ వ్యవహారం.. పైసా వసూల్‌తో బిజీ.. ఎవ్వరికీ స్టేట్మెంట్ ఇవ్వలేదన్న పూరీ.. వాట్సపే?

టాలీవుడ్‌ను షేక్ చేస్తున్న డ్రగ్స్ దందాలో ప్రముఖ సినీ నటుల పేర్లు వినిపిస్తున్న సంగతి ...

news

శివకార్తీకేయన్ కోసం నువ్వా నేనా అంటోన్న నయన-సమంత?

కోలీవుడ్‌లో అగ్రహీరోయిన్లు కలిసి ఒకే సినిమాలో నటిస్తున్నారు. యాంకరింగ్ నుంచి హీరోగా ...

news

వీఐపీ 2 మేకింగ్ వీడియోను చూడండి..

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ రెండో కుమార్తె సౌందర్య రజనీకాంత్ దర్శకత్వంలో వీఐపీ 2 ...

Widgets Magazine