Widgets Magazine

సో... పూరీ మత్తుమందు పీడితుడేనన్నమాట... 19న సిట్ ముందుకు...

సోమవారం, 17 జులై 2017 (21:57 IST)

Widgets Magazine
puri

డ్రగ్స్ కేసులో ఇరుక్కున్న టాలీవుడ్ ప్రముఖుల్లో చాలామంది తొలుత తమకు నోటీసులు అందలేదని బుకాయించారు. కానీ ఆ తర్వాత ఒప్పుకోక తప్పలేదు. తాజాగా రవితేజ తల్లి తన కుమారుడికి నోటీసులు వచ్చాయని చెప్పడంతో వరుసగా మిగిలినవారు కూడా తమకు నోటీసులు అందాయని వివరించారు. పూరీ జగన్నాథ్ కూడా తను ఈ నెల 19న సిట్ ముందు హాజరవుతున్నట్లు వెల్లడించారు.
 
మరోవైపు డ్రగ్స్ కేసులో హీరో రవితేజ పేరు వుండటం వాస్తవమేనని తేలింది. ఆయనకు ఎక్సైజ్ శాఖ నోటీసులు పంపింది. ఈ నెల 22న ఎక్సైజ్ శాఖ కార్యాలయంలో హాజరు కావాలని తెలియజేసింది. దీనితో రవితేజ తల్లి రాజ్యలక్ష్మి తీవ్ర ఆవేదనను వ్యక్తం చేశారు. తన కుమారుడు కనీసం సిగరెట్ కూడా తాగడనీ, తాగేవాళ్లను కూడా ప్రోత్సహించడని అన్నారు. 
 
డ్రగ్స్ కేసులో రవితేజ పేరు రావడం బాధాకరమన్న ఆమె తన కుమారుడికి డ్రగ్స్ అలవాటు ఉందన్న మాట అవాస్తవమన్నారు. రవితేజను కావాలనే ఎవరో ఇరికిస్తున్నారని అన్నారు. సోదరుడు పోయాడన్న బాధలోనే రవితేజ సినిమాలు చేస్తున్నాడనీ, నిర్మాతలకు నష్టం రాకూడదన్న ఒకే ఒక నిశ్చయంతో సినిమా షూటింగులకు వెళ్లాడని చెప్పుకొచ్చారు. 
 
తన కుమారుడు భరత్ బిగ్ బాస్ షోకి సెలెక్ట్ అయ్యాడనీ, ఇందులో భాగంగా అతడు అన్నీ మానేసి రోజూ వ్యాయామం చేసేవాడనీ, కానీ విధి వక్రించి రోడ్డు ప్రమాదంలో చనిపోయాడంటూ ఆవేదన వ్యక్తం చేశారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

డ్రగ్స్ కేసులో రానా, అభిరామ్ పేర్లా? పిచ్చి పుకార్లంటూ...

డ్రగ్స్ కేసులో పలువురు సినిమా నటీనటుల పేర్లు వస్తుండటంతో టాలీవుడ్ ఇండస్ట్రీలో కలకలం ...

news

టాలీవుడ్‌లో డ్రగ్స్ బాబులు... కొత్తగా మందుబాబు నాని షూటింగ్‌కు అలా వచ్చేశాడట...

నాని హీరోగా నటించి, విడుదలైన చిత్రం నిన్ను కోరి. ఈ చిత్రం విడుదలైన మొదటి రోజు నుంచి మంచి ...

news

చెర్రీ మూవీకి రూ.14 కోట్లు డిమాండ్ చేసిన కొరటాల శివ?

కొరటాల శివ... టాలీవుడ్‌లోని స్టార్ డైరెక్టర్లలో ఒకరు. వరుస విజయాలు ఆయన సొంతం. కథా రచయితగా ...

news

డ్రగ్స్ కేసులో రవితేజకు నోటీసులు... 22న హాజరు కావాలి... మావాడు అలాంటోడా?

ఎట్టకేలకు డ్రగ్స్ కేసులో హీరో రవితేజ పేరు వుండటం వాస్తవమేనని తేలింది. ఆయనకు ఎక్సైజ్ శాఖ ...