Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

నీ కోసం కూడా ఇలాంటి చీరే తయారు చేయిద్దాం.. రకుల్‌ ప్రీత్ సింగ్‌తో సమంత

శుక్రవారం, 3 ఫిబ్రవరి 2017 (16:26 IST)

Widgets Magazine
samanta nagachaitanya engagement saree

హీరోయిన్ సమంత ఆదివారం రాత్రి జరిగిన తన నిశ్చితార్థం వేడుకలో బంగారు వర్ణం అంచు కలిగిన తెలుపు చీరలో మెరిసిపోయింది. ముంబైకి చెందిన డిజైనర్‌ క్రేషా బజాజ్‌ డిజైన్‌ చేసిన ఈ చీరకు ప్రత్యేక స్టోరీ ఉంది. నిశ్చితార్థ వేడుకలో సమంత కట్టిన చీర ఆమె ప్రేమకథను, చైతూపై ఆమెకున్న ప్రేమను తెలుపుతోంది.

సమంత చీర అంచును బాగా గమనిస్తే.. అందులో 'ఏమాయ చేసావె' చిత్రంలోని ఓ సన్నివేశం నుంచి మొన్నమొన్న జరిగిన అఖిల్‌ నిశ్చితార్థంలో దిగిన ఫ్యామిలీ ఫొటో వరకు దృశ్యాలు కనిపిస్తాయి. బైక్‌పై సమంత, చైతన్య కలిసి ఉన్న చిత్రం కూడా కనిపిస్తుంది. ఇటీవల సమంత తన ఇన్‌స్ట్రాగ్రామ్‌లో పోస్ట్‌ చేసిన వీడియో ఈ చీరను డిజైన్‌ చేస్తుండగా తీసినట్లుగా తెలుస్తోంది.
 
ఈ చీరపై సోషల్ మీడియాలో చర్చ బాగానే జరిగింది. ఈ నేపథ్యంలో టాలీవుడ్‌ కథానాయికలు సమంత, రకుల్‌ప్రీత్‌ సింగ్‌ ట్విటర్‌ వేదికగా సరదాగా మాట్లాడుకున్నారు. సమంత తన నిశ్చితార్థం వేడుకలో ప్రత్యేకంగా తయారు చేయించిన చీరలో మెరిసి అందరి దృష్టిని ఆకర్షించారు. 
 
చిన్నతనం నుంచి ఇప్పటి వరకు జరిగిన మధురమైన సంఘటనలను గుర్తుకు తెస్తూ డిజైన్‌ చేయించిన ఈ చీరను చూపిస్తున్న ఒక వీడియోను సమంత తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారు. దీనికి రకుల్‌ప్రీత్‌ చీర చాలా నచ్చిందని ట్వీట్‌ చేశారు. వెంటనే సమంత స్పందిస్తూ.. 'నీ కోసం కూడా మనం ఇలాంటిదే తయారు చేయిద్దాం' అని నవ్వుతూ ట్వీట్‌ చేశారు. మరి రకుల్‌ వూరుకుంటారా.. 'సమంత.. ఎప్పుడైనా, ఎక్కడైనా..' అని సిగ్గుపడుతూ బదులిచ్చారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

సునీల్ హీరోగా 'ఉంగరాల రాంబాబు'.. ప్రచార రథం ప్రారంభం

ఇటీవలే 'జ‌క్క‌న్న'తో క‌మ‌ర్షియ‌ల్ స‌క్సెస్‌ని త‌న సొంతం చేసుకొని సూప‌ర్ లైన్ అప్‌తో ...

news

రాఘవ లారెన్స్ 'శివ‌లింగ' ట్రైల‌ర్‌కు 10 ల‌క్ష‌ల వ్యూస్‌

కొరియోగ్రాఫర్‌, డైరెక్ట‌ర్, హీరోగా త‌న‌దైన గుర్తింపు తెచ్చుకున్న లారెన్స్ న‌టించిన తాజా ...

news

బాహుబలి-2 : అనుష్క-ప్రభాస్ పోస్టర్‌లో తప్పు.. సరిచేసుకున్న జక్కన్న..

బాహుబలి-2కు సంబంధించిన ప్రభాస్, అనుష్క పోస్టర్ ఇటీవలే రిలీజైన సంగతి తెలిసిందే. ఈ ...

news

రేష్మితో అందుకే లింక్ పెట్టారు.... ఇక పెళ్లే చేసుకోను... ఎక్కిడికైనా వెళ్తా: సుడిగాలి సుధీర్

జబర్దస్త్ యాంకర్ రష్మికి, ఆ కార్యక్రమంలో పార్టిసిపెంట్ సుడిగాలి సుధీర్‌కు అఫైర్ ఉన్నట్లు ...

Widgets Magazine