బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By dv
Last Updated : శుక్రవారం, 28 అక్టోబరు 2016 (16:42 IST)

నా హృద‌యానికి ద‌గ్గ‌రైన సినిమా... 'ఎంత వరకు ఈ ప్రేమ' : కాజ‌ల్ అగ‌ర్వాల్

'ఎంత వ‌ర‌కు ప్రేమ' సినిమాను విడుద‌ల చేస్తున్న నిర్మాత డి.వెంక‌టేష్‌కి అభినంద‌న‌లు. డీకేగారు కూల్ డైరెక్ట‌ర్‌. అలా త‌న‌కు కావాల్సిన వ‌ర్క్‌ను రాబ‌ట్టుకునే డైరెక్ట‌ర్‌ను నేను వ‌ర్క్ చేయ‌డం సంతోషంగా ఉంది

'ఎంత వ‌ర‌కు ప్రేమ' సినిమాను విడుద‌ల చేస్తున్న నిర్మాత డి.వెంక‌టేష్‌కి అభినంద‌న‌లు. డీకేగారు కూల్ డైరెక్ట‌ర్‌. అలా త‌న‌కు కావాల్సిన వ‌ర్క్‌ను రాబ‌ట్టుకునే డైరెక్ట‌ర్‌ను నేను వ‌ర్క్ చేయ‌డం సంతోషంగా ఉంది. చాలా స్పెష‌ల్ మూవీ. లియోన్ జేమ్స్ బ్యూటీఫుల్ మ్యూజిక్ అందించారు. జీవాతో వ‌ర్క్ చేయ‌డం సంతోషం. మంచి ప్రొఫెష‌న‌ల్ ఆర్టిస్ట్‌, మంచి కోస్టార్‌. స్పాంటేనియ‌స్ యాక్ట‌ర్‌. నా హార్ట్‌కు ద‌గ్గ‌రైన మూవీ ఇది' అని కాజ‌ల్ అగర్వాల్ చెప్పుకొచ్చారు. 
 
`రంగం` వంటి సూపర్ హిట్ మూవీతో తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్న జీవా హీరోగా, కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా రూపొందుతోన్న రొమాంటిక్ కామెడి ఎంటర్టైనర్ `కవలై వేండాం`. ఈ చిత్రాన్ని తెలుగులో `ఎంత వరకు ఈ ప్రేమ` అనే పేరుతో తెలుగులో విడుదల చేస్తున్నారు. డీకే దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి లియోన్ జేమ్స్ సంగీతం అందించారు. ఈ సినిమా ఆడియో విడుద‌ల కార్య‌క్ర‌మం గురువారం హైద‌రాబాద్ జె.ఆర్‌.సి.క‌న్వెన్ష‌న్ సెంట‌ర్‌లో జ‌రిగింది. 
 
`ఎంత వ‌ర‌కు ఈ ప్రేమ` ట్రైల‌ర్‌ను మల్కాపురం శివ‌కుమార్ విడుద‌ల చేశారు. బిగ్ సీడీ, ఆడియో సీడీల‌ను రాహుల్ ర‌వీంద్ర‌న్ విడుద‌ల చేశారు. ఈ సంద‌ర్భంగా జీవా మాట్లాడుతూ 'ఈ ప్రేమ చాలా ఎంట‌ర్‌టైనింగ్ ల‌వ్ స్టోరీ. మా హృద‌యాల‌కు ద‌గ్గరైన మూవీ. ఈ సినిమా దర్శ‌కుడు డీకే నాకు మంచి మిత్రుడు. రంగం సినిమాకు కోడైరెక్ట‌ర్‌గా వ‌ర్క్ చేసిన డీకే చెప్పిన ఈ పాయింట్ న‌చ్చ‌డంతో సినిమా చేశాను. ప్రతి ఒక్క‌రికీ న‌చ్చే సినిమా. ఫుల్ ప‌న్ మూవీ. తెలుగులో సినిమాను విడుద‌ల చేస్తున్న డి.వెంక‌టేష్‌కి ఈ సినిమా పెద్ద స‌క్సెస్‌నివ్వాలి. ఈ సినిమా రూప‌క‌ల్ప‌న‌లో లియోన్ జేమ్స్ మంచి సంగీతం అందించారు. అన్నారు. 
 
నిర్మాత డి.వెంక‌టేష్ మాట్లాడుతూ.. లియోన్ జేమ్స్‌గారు మంచి మ్యూజిక్ అందించారు. అలాగే తెలుగు ఆడియెన్స్‌కు త‌గిన విధంగా మంత్ర ఆనంద్‌గారు సంగీత స‌హ‌కారం అందించారు. సినిమా కామెడి ఎంట‌ర్‌టైన‌ర్‌. భ‌లేభ‌లే మ‌గాడివోయ్‌, పెళ్లిచూపులు త‌ర‌హా మూవీ. సినిమా త‌ప్ప‌కుండా పెద్ద హిట్ అవుతుంది. సినిమా డ‌బ్బింగ్ చెబుతున్న‌ప్పుడు సినిమా ఎలా ఉంద‌ని వెన్నెల‌కంటిని అడిగాను.

సినిమా త‌ప్ప‌కుండా సూప‌ర్‌హిట్ సినిమా అవుతుందని.. ఏం ఆలోచించ‌న‌వ‌స‌రం లేదనే ధైర్యానిచ్చారాయ‌న‌. ఈ సినిమాకు వెన్నెల‌కంటి అద్భుత‌మైన మాట‌లు, పాట‌లు అందించారు. జీవా, కాజ‌ల్ న‌ట‌న‌తో పాటు మిగ‌తా ఆర్టిస్టుల పెర్‌ఫార్మ‌న్స్‌, టెక్నిషియ‌న్ స‌పోర్ట్‌తో సినిమా చాలా బాగా వ‌చ్చింది. సినిమా వ‌చ్చే నెల మొద‌టి వారంలో విడుద‌ల చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నాం. ఎంట‌ర్‌టైన్‌మెంట్‌, ల‌వ్ స్టోరీ స‌హా అన్నీ ఎలిమెంట్స్‌తో అంద‌రికీ న‌చ్చే మూవీ అవుతుంది. స‌పోర్ట్ చేసిన అంద‌రికీ థాంక్స్' అన్నారు.